ఫిఫా వరల్డ్ కప్ 2018 : నేటి నుంచి నాకౌట్ పోటీలు
రష్యా వేదికగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సాగుతున్న ఫిఫా ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గ్రూప్ దశ ముగిసింది. ఇక శనివారం నుంచి ఉత్కంఠ భరిత నాకౌట్ సమరం ప్రారంభంకానుంది. తొలి ప్రీక్వార్టర్స్‌లో అర్జెంట
Publish Date: Sat, 30 Jun 2018 (09:36 IST)
Updated Date: Sat, 30 Jun 2018 (09:38 IST)
రష్యా వేదికగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సాగుతున్న ఫిఫా ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గ్రూప్ దశ ముగిసింది. ఇక శనివారం నుంచి ఉత్కంఠ భరిత నాకౌట్ సమరం ప్రారంభంకానుంది. తొలి ప్రీక్వార్టర్స్‌లో అర్జెంటీనా జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుండగా ఆ తర్వాత పోర్చుగల్, ఉరుగ్వే మధ్య మ్యాచ్ జరుగుతుంది.
ముఖ్యంగా, ఫ్రాన్స్‌తో జరిగే పోరులో అర్జెంటీనా జట్టు పూర్తిగా మెస్సీపైనే ఆధారపడివుంది. అతికష్టమ్మీద ఇక్కడి దాకా చేరిన అర్జెంటీనాకు ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
గ్రూప్ దశలో ఐస్‌లాండ్‌తో డ్రా, క్రొయేషియాపై 0-3 తేడాతో ఓడిన సందర్భంలో మెస్సీ విఫలమయ్యాడు. దీంతో జట్టు ఆట కూడా గాడితప్పింది. కానీ గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో మెస్సీ ఓ సూపర్ గోల్‌తో మెరిశాడు.
ఫలితంగా అర్జెంటీనా కూడా గట్టెక్కడంతో ఈ జట్టు మెస్సీపై ఎంతగా ఆధారపడి ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రాన్స్‌పైనా ఇదే స్థాయిలో చెలరేగితే జట్టుకు ప్రయోజనమే. అయితే జట్టు డిఫెన్సివ్ విభాగంలో లోపాలుండడం ఆందోళనకరం. తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
pnr
Publish Date: Sat, 30 Jun 2018 (09:36 IST)
Updated Date: Sat, 30 Jun 2018 (09:38 IST)