Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (09:16 IST)
ఒలింపిక్స్ క్రీడల్లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో విభాగంలో దేశానికి బంగారు పతకం సాధించిపెట్టాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. ఈ పోటీల్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. 
 
సోమవారం జరిగిన ఈ పోటీల్లో క్వాలిఫైయర్స్ నీరజ్ ఈటెను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఫైనల్స్ తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో మారు జావెలిన్ త్రోను 88.17 మీటర్లు విసిరాడు. పిమ్మట వరుసగా 86.32, 84.64, 87.73, 83.98, మీటర్ల దూరానికి విసిరాడు. మరోవైపు నీరజ్ ప్రత్యర్థులు కిషోర్ జెనా 84.77 మీటర్లతో ఐదో స్థానానికి పరిమితం కాగా, డీపీ మను 84.14 మీటర్ల దూరం విసిరి ఆరో స్థానంలో నిలిచాడు. 
 
ఈ పోటీల్లో రజతం సాధించిన పాక్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ జావెలిన్‌ను 87.82 మీటర్ల దూరం విసిరాడు. ఈటెను 86.67 మీటర్ల దూరం విసిరిన చెక్ క్రీడాకారుడు జాకబ్ వడ్లాచ్ కాంస్య పతకం సాధించాడు. ఇదిలావుంటే, పురుషుల 4x400 మీటర్ల రిలే విభాగంలో భారత బృందం 2.59.92 సెకన్లతో రేసును ముగించి 5వ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో యూఎస్ఏ జట్టు స్వర్ణం గెలుచుకుంది. మహిళల 3000 స్టీపుల్ చెజ్ విభాగంలో భారత క్రీడాకారిణి పరుల్ చౌదరి 11వ స్థానంలో నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

తర్వాతి కథనం
Show comments