Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తగ్గేదేలే... అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు

Advertiesment
pushpa
, గురువారం, 24 ఆగస్టు 2023 (18:18 IST)
అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ చిత్రంలో తన నటనకు గాను అత్యంత గౌరవనీయమైన అవార్డు, జాతీయ అవార్డుతో సత్కరించబడ్డారు. 69వ జాతీయ అవార్డులలో ఉత్తమ నటుడి విభాగంలో విజేతగా నిలిచాడు. ఈ చిత్రం యొక్క సీక్వెల్, 'పుష్ప: ది రూల్' కూడా ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది.
 
webdunia
పుష్ప: ది రైజ్ చిత్రంలో బన్నీ అసాధారణమైన నటనను ప్రదర్శించడమే కాకుండా, అద్భుతమైన డైలాగ్ డెలివరీ మాస్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సామి సామి, శ్రీవల్లి, ఊ అంటావా ఊహు అంటావా అనే సినిమా పాటలతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సాధించాడు. మరోవైపు అలియా భట్,కృతి సనన్ వరుసగా 'గంగూబాయి కతియావాడి', 'మిమి' చిత్రాలకు ఉత్తమ నటి అవార్డును పంచుకున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోహన్ లాల్, రోషన్ మేకా మూవీ వృషభ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి