Webdunia - Bharat's app for daily news and videos

Install App

జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రా జాతీయ రికార్డు

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (13:13 IST)
భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్‌లో కొత్త జాతీయ రికార్డును నెల‌కొల్పాడు. ఫిన్‌ల్యాండ్‌లో జ‌రుగుతున్న పావో నుర్మి గేమ్స్‌లో త‌న జావెలిన్‌ను 89.30 మీటర్ల దూరం విసిరి నీర‌జ్ ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. 
 
గ‌త యేడాది మార్చిలో పాటియాలాలో జ‌రిగిన ఈవెంట్‌లో 88.07 మీట‌ర్ల దూరం విసిరి చోప్రా జాతీయ రికార్డును నెల‌కొల్పిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టేశాడు. 
 
తాజాగా జ‌రిగిన పావో నుర్మి గేమ్స్‌లో నీర‌జ్ చోప్రా త‌న ఖాతాలో సిల్వ‌ర్ మెడ‌ల్ వేసుకున్నాడు. టోక్యో గేమ్స్ త‌ర్వాత నీర‌జ్ తొలిసారి ఇంట‌ర్నేష‌న‌ల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఫిన్‌ల్యాండ్ అథ్లెట్ ఒలివ‌ర్ హిలాండ‌ర్ త‌న జావెలిన్‌ను 89.83 మీట‌ర్ల దూరం విసిరి గోల్డ్ మెడ‌ల్‌ను గెలుచుకున్నాడు. 
 
ఒలింపిక్స్ గేమ్స్ త‌ర్వాత ఇచ్చిన తొలి ప్ర‌ద‌ర్శ‌న‌లోనూ నీర‌జ్ అద్భుత ప్రదర్శన చూపించాడు. అసాధార‌ణ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచాడు. దాదాపు 90 మీట‌ర్ల మార్క్‌ను అత‌ను ట‌చ్ చేశాడు.
 
నుర్మి గేమ్స్ తొలి త్రోలో జావెలిన్‌ను 86.92 మీట‌ర్ల దూరం విసిరాడు. ఆ త‌ర్వాత రెండో అటెంప్ట్‌లో 89.30 మీట‌ర్ల దూరం విసిరాడు. ఇక ఆ త‌ర్వాత మూడు ప్ర‌య‌త్నాల్లో అత‌ను ఫౌల్ అయ్యాడు. ఆర‌వ సారి 85.85 మీట‌ర్ల దూరం విసిరాడు.

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

తర్వాతి కథనం
Show comments