వచ్చే యేడాది నుంచి ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంపు

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (10:56 IST)
వచ్చే యేడాది జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో మ్యాచ్‌ల సంఖ్య పెంచనున్నారు. ఐపీఎల్ 16వ సీజన్ కోసం నిర్వహించిన బిడ్డింగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా, మీడియా హక్కులు రికార్డు స్థాయి ధర పలికింది. దీంతో వచ్చే సీజన్‌ నుంచి మ్యాచ్‌ల సంఖ్యను పెంచనున్నారు. 
 
ఐపీఎల్‌లో ఓ సీజన్ నిడివి రెండున్నర నెలలు ఉండేలా ఐసీసీ షెడ్యూల్‌లో మార్పులు చేయనున్నట్టు సమాచారం. ఆ లెక్కన ఓ ఐపీఎల్‌లో 94 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. పైగా వచ్చే ఐపీఎల్ సీజన్ రెండున్నర నెలలు జరిగే అంశాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా నిర్ధారించారు. 
 
ఈ మేరకు తాము అన్ని దేశాల క్రికెట్ బోర్డులతోనూ, ఐసీసీతోనూ చర్చించామని వెల్లడించారు. తద్వారా ఐపీఎల్ కు అగ్రశ్రేణి అంతర్జాతీయ క్రీడాకారులు అందుబాటులో ఉండేందుకు మార్గం సుగమం అయిందని జై షా తెలిపారు. అంతేకాదు, వచ్చే సీజన్ నుంచి మహిళల ఐపీఎల్ కూడా తమ ప్రాధాన్యతాంశమని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్త హై-స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

తర్వాతి కథనం
Show comments