వైజాగ్‌లో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (07:36 IST)
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో మ్యాచ్‌లో సఫారీలు చిత్తయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ళు అన్ని రంగాల్లో రాణించడంతో విజయభేరీ మోగించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో సఫారీలు 19.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 48 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
తప్పక గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 57, ఇషాన్ కిషన్ 54, హార్దిక్ పటేల్ 32 చొప్పున పరుగులు చేసి రాణించారు. ముఖ్యంగా ఓపెనర్లు రుతురాజ్, ఇషాన్ కిషన్‌లో మంచి పునాది వేశారు. దీంతో భారత్ 179 పరుగులు చేయగలిగింది. 
 
ఆ తర్వా 180 పరుగుల గెలుపు లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు... 19.1 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో హెన్రిచ్ క్లాసెస్ 29, రిజా హెండ్రిక్స్ 23, ప్రిటోరియస్ 20 మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలిన వారంతా విఫలం కావడంతో సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 4, చాహల్ 3, అక్షర్ పటే, భవనేశ్వర్ కుమార్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఈ గెలుపుతో భారత్ 1-2తో సిరీస్‌ రేసులో నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఈ నెల 17వ తేదీన రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments