Webdunia - Bharat's app for daily news and videos

Install App

JioStar: జియోస్టార్ చేతికి యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ స్ట్రీమింగ్ హక్కులు

సెల్వి
బుధవారం, 6 ఆగస్టు 2025 (15:16 IST)
Jio Star
యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ల కోసం రాబోయే ఐదు సంవత్సరాలకు ప్రత్యేకమైన ప్రసార  స్ట్రీమింగ్ హక్కులను జియోస్టార్ పొందినట్లు ప్రకటించింది. ఈ మైలురాయి భాగస్వామ్యంతో యూఎస్‌‌టీఏ బిల్లీ జీన్ కింగ్ నేషనల్ టెన్నిస్ సెంటర్ హార్డ్ కోర్టుల నుండి ప్రతి మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో  జియో హాట్ స్టార్‌లో ప్రసారం చేస్తుంది. ప్రతీ మ్యాచ్‌ను నేరుగా లక్షలాది భారతీయ స్క్రీన్‌లకు అందిస్తుంది. ప్రపంచ టెన్నిస్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్‌లలో ఒకటనేది తెలిసిందే. 
 
కార్లోస్ అల్కరాజ్, ఇగా స్విటెక్, నోవాక్ జొకోవిచ్, కోకో గౌఫ్ కోర్టులోకి దిగగా, జానిక్ సిన్నర్, అరినా సబలెంకా వరుసగా తమ పురుషుల, మహిళల సింగిల్స్ టైటిళ్లను గెలుచుకోవాలని చూస్తున్నారు. 
 
జియోస్టార్ తన కవరేజ్‌లో భాగంగా, ప్రపంచంలోనే అత్యధికంగా హాజరయ్యే వార్షిక క్రీడా కార్యక్రమాలను టార్గెట్ చేస్తోంది. ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్‌ల విస్తరిస్తున్న పోర్ట్‌ఫోలియోకు యుఎస్ ఓపెన్‌ను జోడించడం మాకు చాలా ఆనందంగా ఉంది.
 
USTAతో ఈ అనుబంధం మా ప్లాట్‌ఫామ్‌లలో అభిమానులకు అందుబాటులో ఉన్న ప్రీమియర్ గ్లోబల్ స్పోర్ట్స్ కంటెంట్ పరిధిని మరింతగా పెంచుతుందని జియోస్టార్ ఇంటర్నేషనల్ అక్విజిషన్స్ అండ్ సిండికేషన్ హెడ్ హ్యారీ గ్రిఫిత్ అన్నారు.
 
యుఎస్ ఓపెన్‌తో, జియోస్టార్ ఇప్పుడు నాలుగు ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్‌లలో రెండింటికి నిలయంగా ఉంది. ఏడాది పొడవునా టెన్నిస్ కవరేజీని అందిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments