తిరుపతిలో ఓ అద్భుత ఘటన జరిగింది. తిరుపతిలోని గోవిందరాజులు ఆలయానికి సమీపంలో వుండే ఓ చిన్న శివాలయంలో శివలింగం కళ్లు తెరిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రావణ మాసం తొలిరోజే ఇలా జరగడంతో భక్తులు ఆ శివాలయానికి తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. శివలింగం నిజంగానే కళ్లు తెరిచిందా అని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు సైతం మోహరించాల్సి వచ్చింది.
శివలింగం కళ్లు తెరవడంపై కొందరు వేరే కారణాలు వుండవచ్చని అంటున్నారు. వాతావరణ పరిస్థితులు, కాంతి పరావర్తనం ఇత్యాది కారణాలు వుండే అవకాశం వుందని చెబుతున్నారు. గతంలో కూడా వినాయక విగ్రహాలు పాలు తాగాయనీ, దానికి కూడా కొన్ని పరిస్థితులు కారణమయ్యాయని అంటున్నారు. ఏదేమైనప్పటికీ భగవంతుడి శక్తి ఎవ్వరికీ అంతు పట్టదు కదా.