Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ : కెన్యాతో భారత్ ఢీ

ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌లో టైటిలే లక్ష్యంగా భారత కెప్టెన్ సునీల్‌ ఛెత్రి ఆధ్వర్యంలోని భారత ఫుట్‌బాల్ జట్టు ఆదివారం కెన్యాతో తలపడనుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టుకు అత్యధిక గోల్స్‌ సాధించిపెట్టిన

Webdunia
ఆదివారం, 10 జూన్ 2018 (10:32 IST)
ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌లో టైటిలే లక్ష్యంగా భారత కెప్టెన్ సునీల్‌ ఛెత్రి ఆధ్వర్యంలోని భారత ఫుట్‌బాల్ జట్టు ఆదివారం కెన్యాతో తలపడనుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టుకు అత్యధిక గోల్స్‌ సాధించిపెట్టిన వారిలో మూడో స్థానంలో ఉన్న ఛెత్రి.. ఆడిన మూడు మ్యాచ్‌లలో తనదైన ముద్రను వేస్తూ గోల్స్‌ సాధించడం భారత్‌ను టైటిల్‌ ఫేవరెట్‌గా నిలిపింది.
 
పైగా, ఫైనల్స్‌కు టిక్కెట్లన్నీ అమ్ముడవడంతో ప్రేక్షకుల మద్దతుకూడా భారత్‌లో ఆత్మవిశ్వాసం నింపుతుంది. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న  ఏఎఫ్సీ ఆసియన్‌ కప్‌కు సన్నాహకంగా ఈ టోర్నీకి భారత్‌ ఆతిథ్యమిస్తోంది. లీగ్‌ దశలో కెన్యాను 3-0తో ఓడించడంకూడా భారత్‌కు కలిసొచ్చే అంశం. 
 
అయితే న్యూజిలాండ్‌ను 2-1, చైనీస్‌ తైపీని 3-0తో ఓడించిన కెన్యాను తేలికగా తీసుకోవడం లేదని భారత కోచ్‌ స్టీఫెన్‌ కాన్‌స్టాంటైన్‌ తెలిపాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రెండు మార్పులు చేయడంతో భారత్‌ 1-2 తేడాతో ఓడిపోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫైనల్లో ఎలాంటి ప్రయోగాలు చేయడంలేదన్నాడు. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments