Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ-20 ఆసియా కప్- దాయాది పాక్‌కు భారత మహిళా జట్టు చుక్కలు..

ట్వంటీ-20 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో దాయాది దేశమైన పాకిస్థాన్‌ను భారత మహిళా జట్టు చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పా

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (15:43 IST)
ట్వంటీ-20 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో దాయాది దేశమైన పాకిస్థాన్‌ను భారత మహిళా జట్టు చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు కేవలం 72 పరుగులు మాత్రమే సాధించగలిగింది. 
 
ఈ స్వల్ప 73 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు కేవలం 16.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అధిగమించారు. తద్వారా ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించిన భారత జట్టు ఫైనల్ పోరుకు సిద్ధమైంది. 
 
భారత మహిళా జట్టులో మొదటి ఓవర్‌లోనే మిథాలీరాజ్ ఔట్ అయ్యింది. దీంతో భారత జట్టులో టెన్షన్ మొదలైంది. అయితే తర్వాత బ్యాటింగ్‌కు దిగిన స్పృతి మంధాన నిలకడగా ఆడింది. 38 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 34 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.
 
అంతకుముందు పాకిస్థాన్ బ్యాట్స్‌ఉమెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇండియన్ ఉమెన్స్ బౌలింగ్ ధాటికి విలవిల్లాడిపోయింది. ఫలితంగా నహఇద, సనామిర్ మాత్రమే 18, 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిగతా వాళ్లు అందరూ 7, 8, 9 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో బిస్త్ మూడు వికెట్లు తీసి పాక్‌ను చావుదెబ్బ కొట్టింది. ఫలితంగా భారత్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

తర్వాతి కథనం
Show comments