Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ ఒలింపిక్స్.. భారత హాకీ జట్టుకు నగదు వర్షం

ఠాగూర్
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (08:34 IST)
పారిస్ కేంద్రంగా సాగుతున్న ఒలింపిక్ క్రీడా పోటీల్లో భారత పురుషుల హాకీ జట్టు పతకం సాధించింది. 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండవ ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. దీంతో జట్టుకు హాకీ ఇండియా నగదు బహుమతి ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్యం సాధించిన జట్టులోని ప్రతి ఆటగాడికి రూ.15 లక్షలు చొప్పున నగదు బహుమతి అందించనున్నట్టు వెల్లడించింది. ఇక జట్టులోని సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.7.5 లక్షలు అందచేస్తామని తెలిపింది. 
 
కాగా గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్‌పై భారత హాకీ జట్టు 2-1 తేడాతో చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండవ ఒలింపిక్స్‌లో భారత జట్టు పతకాన్ని ముద్దాడినట్టయింది. 
 
పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని సాధించిన జట్టుపై హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆటగాళ్లను మెచ్చుకున్నారు. వరుసగా రెండో ఒలింపిక్‌లోనూ పతకం గెలవడం అసాధారణమైన విజయమని కొనియాడారు. ఈ నగదు బహుమతి క్రీడాకారులు ప్రయత్నాలకు ఒక ప్రశంస మాత్రమేనని దిలీప్ టిర్కీ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రభాస్, అల్లు అర్జున్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయండి.. రోజా డిమాండ్ (Video)

హైదరాబాదులో 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం.. ఎందుకంటే?

వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే.. కేసీఆర్

మహారాష్ట్ర ఎన్నికలు: వ్యానులో వామ్మో రూ.3.70 కోట్లు స్వాధీనం

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణి అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

డ్రింకర్ సాయి టైటిల్ ఆవిష్కరించిన డైరెక్టర్ మారుతి

తర్వాతి కథనం
Show comments