Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమికులుగా విడిపోయారు... దేశం కలిసి గోల్డ్ మెడల్ గెలిచారు!!

Siniakova and Machac

ఠాగూర్

, గురువారం, 8 ఆగస్టు 2024 (10:37 IST)
వారిద్దరూ కొంతకాలం ప్రేమికులుగా ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. కానీ, దేశం కోసం మళ్లీ ఒక్కటయ్యారు. బంగారు పతకాన్ని ఒడిసి పట్టుకున్నారు. పారిస్ వేదికగా జరుగుతున్న విశ్వక్రీడల్లో టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ స్వర్ణం గెలిచిన చెక్ రిపబ్లిక్ ఫైనల్లో అద్భుతంగా ఆడిన చెక్ జోడీ సినియకోవా-టోమాస్ మచాక్. 
 
గతంలో ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉండేది. ఎందుకనో ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. టెన్నిస్ జంట పారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ క్రీడాంశంలో మిక్స్‌డ్ డబుల్స్ స్వర్ణ పతకాన్ని చెక్ రిపబ్లిక్‌కు చెందిన కాటెరినా సీనియాకోవా, టోమాస్ మచాక్ జోడీ గెలుచుకుంది. అయితే, వీళ్ల విజయం పట్ల సోషల్ మీడియాలో సందడి మామూలుగా లేదు. ఇందులో ప్రేమ కోణం ఉండడమే అసలు విషయం.
 
వివరాల్లోకెళితే... సినియాకోవా, టోమాస్ మచాక్ గతంలో ప్రేమికులు. టెన్నిస్ ఆట ఇద్దరినీ కలిపింది. ఒకే దేశం కావడంతో త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అందరూ భావించగా, అభిమానులకు నిరాశ కలిగిస్తూ... ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య సంబంధానికి తెరపడింది. కానీ, పారిస్ ఒలింపిక్స్ పుణ్యమా అని ఇద్దరూ మళ్లీ జట్టు కట్టారు. అయితే ప్రేమ కోసం కాదు... దేశం కోసం. వ్యక్తిగత జీవితంలోని విభేదాలన్నీ పక్కనబెట్టి కష్టపడి ఆడి తమ దేశానికి స్వర్ణం అందించారు. 
 
మీడియా సమావేశంలో కొందరు రిపోర్టర్లు సినియకోవా-టోమాస్ మచాక్‌లను వారి లవ్ లైఫ్ గురించి ప్రశ్నించారు. మీ మధ్య ప్రేమ బంధం తెగిపోయిందన్నారు... కానీ సమన్వయంతో ఆడి గోల్డ్ మెడల్ గెలిచారు... ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. అందుకు సినియకోవా స్పందిస్తూ... "మా వ్యక్తిగత జీవితం గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరంలేదు. అయినా మీరు ఇలా అయోమయానికి గురికావడం చూస్తుంటే భలేగా ఉంది" అని వ్యాఖ్యానించింది. టోమాస్ మచాక్ స్పందిస్తూ... "ఇది చాలా పెద్ద రహస్యం" అంటూ నవ్వేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిల్వర్ మెడల్‌కు అర్హురాలిని.. కోర్టును ఆశ్రయించిన వినేశ్ ఫొగాట్