Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ క్రీడలు - పతకాల పట్టికలో భారత్ స్థానం 4 - మన 'బంగారాలు' వీరే..

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (08:48 IST)
బర్మింగ్‌హ్యామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ప్రస్థానం ముగింది. ఇందులో పతకాల పట్టికలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం 61 పతకాలు సాధించింది. ఇందులో 22 బంగారు పతకాలు ఉండటం గమనార్హం. మిగిలిన వాటిలో 16 రజతం, 23 కాంస్య మెడల్స్ ఉన్నాయి. 
 
ఈ క్రీడల ఆఖరి రోజున భారత షట్లర్లు అదదిరిపోయేలా సత్తా చాటి ఏకంగా మూడు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఇందులో టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమర్ బంగారం, సాతియాన్ జ్ఞానేశ్వరన్‌కు కాంస్యం రాగా, పురుషుల హాకీ జట్టు రజతం సాధించింది. 
 
భారత తరపున ఆరుగురు రెజ్లర్లు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. వీరిలో స్టార్​ రెజ్లర్​ బజరంగ్​ పునియా పురుషుల 65 కిలోల విభాగంలో పసిడి సాధించాడు. వరుసగా రెండోసారి కామన్వెల్త్​ క్రీడల్లో గోల్డ్​ ఒడిసిపట్టాడు.
 
ఒలింపిక్స్​లో రజతం సాధించిన స్టార్​ రెజ్లర్​ రవికుమార్​ దహియా.. ఈసారి కామన్వెల్త్​లో పసిడి పతకాన్ని ముద్దాడాడు. రెజ్లింగ్​ పురుషుల 86 కేజీల విభాగంలో దీపక్​ పునియా అద్భుతం చేశాడు. పాకిస్థాన్​ ఛాంపియన్​ మహ్మద్​ ఇనామ్​ను ఫైనల్లో చిత్తుగా ఓడించి గోల్డ్​ సొంతం చేసుకున్నాడు.
 
మహిళల రెజ్లింగ్​ 62 కేజీల విభాగంలో సాక్షి మాలిక్​ పసిడిని ముద్దాడింది. ఫైనల్లో కెనడాకు చెందిన గొంజాలెజ్​ను ఓడించింది. మహిళల రెజ్లింగ్​ 53 కేజీల విభాగంలో పసిడి సాధించిన వెటరన్​ రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ చరిత్ర సృష్టించింది. ఇది ఆమెకు వరుసగా మూడో కామన్వెల్త్​ గోల్డ్ పతకం కావడం గమనార్హం. పురుషుల రెజ్లింగ్​ 74 కేజీల విభాగంలో 19 ఏళ్ల నవీన్​ కుమార్​.. పాక్​ రెజ్లర్​ షరీఫ్​ను ఓడించి బంగారం నెగ్గాడు. 
 
కామన్వెల్త్​ క్రీడల్లో బ్యాడ్మింటన్​ ప్లేయర్లు ఆఖరిరోజు మూడు బంగారు పతకాలు సాధించారు. తొలుత మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సిందు గెలిచి తొలిసారి కామన్​వెల్త్​ గేమ్స్​లో స్వర్ణం నెగ్గింది. బ్యాడ్మింటన్​ పురుషుల సింగిల్స్​లో లక్ష్యసేన్​ కూడా పసిడి సాధించాడు.
బ్యాడ్మింటన్​ పురుషుల డబుల్స్​లో సాత్విక్​ సాయిరాజ్​- చిరాగ్​ శెట్టి జోడీ బంగారం నెగ్గింది. 
 
ఒలింపిక్స్​ స్వర్ణ పతక విజేత, వెయిట్​ లిఫ్టర్​ మీరాబాయి ఛాను కామన్వెల్త్​ లోనూ గోల్డ్​ సాధించింది. 49 కేజీల విభాగంలో ఆమె మొత్తం 201 కేజీల బరువు ఎత్తింది. పురుషుల వెయిట్​ లిఫ్టింగ్​లోనే జెరెమీ కూడా గోల్డ్​ నెగ్గాడు. వెయిట్​ లిఫ్టింగ్​ పురుషుల 73 కేజీల విభాగంలో అచింత షూలే బంగారం నెగ్గాడు. మొత్తం 313 కేజీల బరువును ఎత్తడం విశేషం.
 
కామన్వెల్త్​ క్రీడల్లో భారత బాక్సర్లు కూడా అదరగొట్టారు. మినిమమ్​ వెయిట్​ కేటగిరీలో అమిత్​ పంఘాల్​ పసిడి నెగ్గాడు. తెలంగాణ అమ్మాయి నిఖత్​ జరీన్​ బాక్సింగ్​ 50 కేజీల లైట్​ వెయిట్​ విభాగంలో బంగారం సాధించింది. బాక్సింగ్​ మినిమమ్​ వెయిట్​ కేటగిరీలోనే నీతూ గంఘాస్​ పసిడి సాధించింది. 
 
టేబుల్​ టెన్నిస్​లో వెటరన్​ ప్లేయర్​ శరత్​ కమల్​ పురుషుల సింగిల్స్​లో ఆఖరి రోజు గోల్డ్​ సాధించాడు.  లాన్​ బౌల్స్​ మహిళల విభాగంలో భారత్​ తొలిసారి కామన్వెల్త్​ క్రీడల్లో గోల్డ్​ నెగ్గింది. అథ్లెటిక్స్​ మెన్స్​ ట్రిపుల్​ జంప్​లో ఎల్దోస్​ పాల్​ గోల్డ్​ నెగ్గాడు. పారా పవర్​ లిఫ్టర్ సుధీర్​ కూడా కామన్వెల్త్​ క్రీడల్లో గోల్డ్​ నెగ్గాడు. అతడు మొత్తం 212 కేజీల బరువులు ఎత్తాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments