Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ గేమ్స్ 2018 : 11 రోజుల పాటు క్రీడా పండుగ

ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ క్రీడలకు రంగం సిద్ధమైంది. 71 దేశాల నుంచి 6 వేలకు పైగా ఆటగాళ్లు పాల్గొనే క్రీడా పండుగ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా 21వ కామన్వెల్త్ గే

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (10:11 IST)
ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ క్రీడలకు రంగం సిద్ధమైంది. 71 దేశాల నుంచి 6 వేలకు పైగా ఆటగాళ్లు పాల్గొనే క్రీడా పండుగ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా 21వ కామన్వెల్త్ గేమ్స్ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం జరుగనుంది. 
 
ఈ పోటీలు గురువారం నుంచి మొదలవుతాయి. ఈ నెల 15వ వరకూ 11 రోజుల పాటు పోటీలు జరుగుతాయి. ఈ మెగా ఈవెంట్‌లో మెరుగైన రికార్డు ఉన్న భారత్‌ ఈసారి 219 మంది అథ్లెట్లతో బరిలోకి దిగుతోంది. కరారా స్టేడియంలో భారత బ్యాడ్మింటన్ షట్లర్ పీవీ సింధు పతాకంతో ఆరంభ వేడుకల్లో మువ్వన్నెల జెండాతో మన బృందాన్ని ముందుండి నడిపించనుంది.
 
గత గ్లాస్గో క్రీడల్లో భారత్‌ 15 స్వర్ణాలు సహా 64 పతకాలు గెలుచుకుంది. అంతకుముందు 2010లో స్వదేశంలో జరిగిన క్రీడల్లో సెంచరీ కొట్టి అత్యుత్తమంగా రెండో స్థానం దక్కించుకుంది. ఇండియా గత ఐదు అంచెల్లో టాప్‌-5లో చోటు నిలబెట్టుకుంటూ వస్తోంది. ఈసారి కూడా దాన్ని కాపాడుకోవడంతో పాటు గతేడాది కంటే ఎక్కువ పతకాలు నెగ్గాలని చూస్తోంది. ఈ క్రీడల్లోనూ భారత్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో నిలుస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments