Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూపాయికే వైఫై: ఐదు నిమిషాల్లో గేమ్‌లు, పాటలు డౌన్‌లోడ్ చేసేస్తున్నారు..

ఉచిత డేటా పేరిట రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో టెలికాం రంగం సంస్థలన్నీ డేటా ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా వైఫై ప్రస్తుతం నిత్యావసర జాబితాలో చేరింది. ఇలాంటి తరుణ

Advertiesment
రూపాయికే వైఫై: ఐదు నిమిషాల్లో గేమ్‌లు, పాటలు డౌన్‌లోడ్ చేసేస్తున్నారు..
, ఆదివారం, 28 జనవరి 2018 (10:35 IST)
ఉచిత డేటా పేరిట రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో టెలికాం రంగం సంస్థలన్నీ డేటా ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా వైఫై ప్రస్తుతం నిత్యావసర జాబితాలో చేరింది. ఇలాంటి తరుణంలో ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో కొన్ని  స్టార్టప్ కంపెనీలు  ప్రీ-పెయిడ్ వైఫై ప్యాక్సును అందుబాటులోకి తీసుకొచ్చాయి.
 
రూపాయి నుంచి రూ.20వరకు అందరికీ అందుబాటులో వుండేలా కూపన్లను విడుదల చేస్తున్నాయి. పట్టణాల్లోని మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యంత చవగ్గా వైర్‌లెస్ ఇంటర్నెట్‌ను అందించడమే లక్ష్యంగా స్టార్టప్‌లు రంగంలోకి దిగాయి. హర్యానా సరిహద్దుల్లో వున్న ఢిల్లీలోని సంగం విహార్‌కు చెందిన ఓ స్టేషనరీ దుకాణ ఓనర్ ఇప్పటికే రూ.250కే వైఫై కూపన్లను విక్రయించాడు. 
 
ఇదేవిధంగా రెండు నెలల క్రితం దుకాణంలో వై-ఫై హాట్ ‌స్పాట్‌ను ఏర్పాటు చేసుకున్న అతను ఐదు నిమిషాల పాటు వై-ఫైను ఉపయోగించుకునేందుకు రూపాయి కూపన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. 
 
తన వద్ద రూ.20 కూపన్లు కూడా ఉన్నాయని తెలిపాడు. రూపాయి ఖర్చుతో ఐదు నిమిషాల్లో తమకు కావాల్సిన గేములు, పాటలను డౌన్ లోడ్  చేసుకుని వెళ్లిపోతున్నట్టు చెప్పాడు. రూపాయికి వైఫైకి మంచి ఆదరణ లభిస్తోందని.. యువత దీనిని అధికంగా ఉపయోగించుకున్నట్లు ఆతడు తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీమ ప్రజల సమస్యలపై స్పందిస్తా.. ప్రధాని వద్దకు వెళతా: పవన్