Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీమ ప్రజల సమస్యలపై స్పందిస్తా.. మంత్రి పరిటాల సునీత ఇంట్లో టిఫిన్ (వీడియో)

రాయలసీమ సీమ ప్రజల సమస్యలపై స్పందిస్తానని.. అనంతలో కేవలం మూడు రోజుల పర్యటనకు మాత్రమే పరిమితం కాదని.. ఇకపై పదే పదే ఇక్కడికి వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. సీమ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైనా స్పంద

సీమ ప్రజల సమస్యలపై స్పందిస్తా.. మంత్రి పరిటాల సునీత ఇంట్లో టిఫిన్ (వీడియో)
, ఆదివారం, 28 జనవరి 2018 (10:02 IST)
రాయలసీమ సీమ ప్రజల సమస్యలపై స్పందిస్తానని.. అనంతలో కేవలం మూడు రోజుల పర్యటనకు మాత్రమే పరిమితం కాదని.. ఇకపై పదే పదే ఇక్కడికి వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. సీమ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైనా స్పందిస్తానని తెలిపారు.
 
తన బృందం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి, వాళ్ల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోందని.. వారిచ్చే రిపోర్టును బట్టి.. వెంటనే స్పందించాల్సిన అవసరం వుందని.. ప్రజల సమస్యల వివరాలు తీసుకుని ప్రధాన మంత్రి మోదీ వద్దకు వెళ్తానని చెప్పారు.
 
సీమలోని ప్రతి జిల్లాకూ తాగునీరు అందించడం తన తొలి లక్ష్యమని పవన్ అన్నారు. రాయలసీమ సమస్యల సత్వర పరిష్కారానికి ఓ మెమొరాండం తీసుకుని తాను ప్రధాని వద్దకు వెళ్లనున్నానని పవన్ తెలిపారు.

ఇకపోతే.. అనంత పర్యటనలో భాగంగా, ఆదివారం ఉదయం కదిరికి బయలుదేరే ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. పవన్‌ను ఆహ్వానించిన పరిటాల శ్రీరామ్, ఆయన్ను లోపలికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా పరిటాల వారింట పవన్ కల్యాణ్ అల్పాహారాన్ని తీసుకున్నారు. దాదాపు గంట పాటు సునీతతో పలు విషయాలపై పవన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. పవన్ తమ ఇంటికి రావడం ఎంతో సంతోషంగా వుందని పరిటాల శ్రీరామ్, సునీత హర్షం వ్యక్తం చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2019 ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తానంటే : పవన్ కళ్యాణ్