Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీడబ్ల్యూ‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో మెరిసిన అమలాపురం కుర్రాడు

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (11:03 IST)
satwik
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూ‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో సెమీ ఫైనల్‌కి చేరుకున్నాడు అమలాపురం కుర్రాడు.. భారత డబుల్స్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్. మహారాష్ట్రకి చెందిన తన సహచరుడు చిరాగ్ షెట్టితో కలిసి అమలాపురం కుర్రాడు కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో పతకం అందుకోబోతున్న భారత మెన్స్ డబుల్స్ తొలి జోడీగా సాత్విక్- చిరాగ్ శెట్టి జంట రికార్డు కెక్కనుంది. 
 
ఓవరాల్ గా ఈ మెగా టోర్నీ డబుల్స్ విభాగంలో భారత్‌కు ఇది రెండో పతకం కానుంది. 2011లో గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడీ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం సాధించింది.
 
టోక్యో వేదికగా జరుగుతున్న తాజా టోర్నీలో భారత్ నుంచి సాత్విక్- చిరాగ్ జంట మాత్రమే మిగిలింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ జంట 24-22, 15-21, 21-14తో జపాన్‌కు చెందిన టకుర హొకి- యుగో కొబయాషి జంటపై మూడు గేమ్స్‌పై పోరాడి అద్భుత విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments