ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. మూడో రౌండ్‌లో సానియా మీర్జా, చెక్ రిపబ్లిక్ కు చెందిన లూసీ హడెక్కా జంట ఓడిపోయింది.
అమెరికాకు చెందిన కోకో గాఫ్, జెస్సికా పెగులా చేతిలో 6-4, 6-3 తేడాతో ఓడిపోయింది. సానియా, లూసీ జంట అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చినప్పటికీ ప్రత్యర్థుల ముందు తలవంచక తప్పలేదు. అనవసర తప్పిదాలతో సానియా జోడీ మ్యాచ్ ను చేజార్చుకుంది.
మరోవైపు బుధవారం తెల్లవారుజామున జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తన ప్రత్యర్థి నొవాక్ జొకోవిచ్‌పై గెలుపొందాడు.
నాలుగు సెట్ల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రాఫెల్ నాదల్ తనదైన మార్క్ షాట్లతో విరుచుకుపడ్డాడు. తద్వారా తన కెరీర్లో 15వ సారి ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. రోలాండ్ గారోస్ కోర్ట్‌లో 13సార్లు గెలుపొందాడు.