Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌కెళ్లి అక్కడే సెటిలైన అథ్లెట్స్

ఇటీవల ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో అథ్లెట్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో వివిధ దేశాలకు చెందిన వేలాది మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. ఇలా వెళ్లిన వారిలో 255 మంది క్రీడాకారులు తిరిగి తమతమ స్వదేశాలకు

Webdunia
మంగళవారం, 22 మే 2018 (16:25 IST)
ఇటీవల ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో అథ్లెట్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో వివిధ దేశాలకు చెందిన వేలాది మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. ఇలా వెళ్లిన వారిలో 255 మంది క్రీడాకారులు తిరిగి తమతమ స్వదేశాలకు వెళ్లకుండా అక్కడే తిష్టవేశారు. ఇలాంటివారిలో 205 అథ్లెట్స్ ఆస్ట్రేలియాలో శరణార్థుల వీసా కోసం దరఖాస్తు చేసుకోగా మరో 50 మంది అక్రమంగా ఉంటున్నారు.
 
ఈవిషయం ఓ సెనేట్ కమిటీకి ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఇచ్చిన నివేదికలో బహిర్గతమైంది. మొత్తం 8103 మంది అథ్లెట్లు, అధికారులు, మీడియా ప్రతినిధులు గేమ్స్ కోసం ఆస్ట్రేలియాకు తాత్కాలిక వీసాలపై వచ్చారు. ఇందులో 7,848 మంది వారివారి దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. 255 మంది అక్కడే ఉండిపోయినట్టు ఆ నివేదిక పేర్కొంది. 
 
205 మంది చట్టబద్ధంగా శరణార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకొని ఆమోదం కోసం వేచి చూస్తున్నారు. ఇక అక్రమంగా ఉంటున్న మరో 50 మంది కోసం బోర్డర్ ఫోర్స్ అఫీషియల్స్ వెతుకుతున్నారు. ఈ శరణార్థి వీసాల కోరిన వాళ్లలో ఆఫ్రికన్ దేశాలైన సియెరా లియోన్, ఘన, నైజీరియాల నుంచే ఎక్కువగా ఉన్నారు. భారత్, పాకిస్థాన్‌ దేశాల నుంచి కూడా కొందరు అథ్లెట్లు అక్కడే ఉండిపోయినట్టు సమాచారం. వీళ్లలో చాలా మంది వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆస్ట్రేలియా హోంశాఖ కార్యదర్శి మలీసా గోలైట్లి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గడ్డం, మీసంతో కనిపించిన అఘోరీ.. చేతిలో నిమ్మకాయలు.. ఏం చేస్తోంది..? (video)

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

గర్భిణులకు ఓవర్ డోస్ యాంటీబయోటిక్స్.. నకిలీ డాక్టర్ అరెస్ట్

అదానీతో జగన్ మెడకు ఉచ్చు.. విచారణ ఖాయమేనా..?

పవన్ ప్రచారం ఫలించింది.. రేవంతన్న క్యాంపెయిన్ తప్పిపోయింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

తర్వాతి కథనం
Show comments