ఆస్ట్రేలియా శాస్త్రవేత్త స్వీయ మరణం... ప్రాణాంతక ఔషధం మింగి...

ఆస్ట్రేలియా శాస్త్రవేత్త స్వీయ మరణం పొందారు. ప్రాణాంతక ఔషధం మింగి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన వయసు 104 యేళ్లు. ఆయన పేరు డేవిడ్ గుడాల్. తాను ఇంకా బతికి ప్రయోజనం లేదని, చనిపోవాలని నిర్ణయించుకున్న

శుక్రవారం, 11 మే 2018 (09:02 IST)
ఆస్ట్రేలియా శాస్త్రవేత్త స్వీయ మరణం పొందారు. ప్రాణాంతక ఔషధం మింగి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన వయసు 104 యేళ్లు. ఆయన పేరు డేవిడ్ గుడాల్. తాను ఇంకా బతికి ప్రయోజనం లేదని, చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఇటీవల ప్రకటించారు. అలా ప్రకటించినట్టుగానే ఆయన మృత్యువును స్వయంగా ఆహ్వానించారు.
 
స్విట్జర్లాండ్‌లోని బేసెల్‌లో లైఫ్‌ సర్కిల్‌ అనే ఆస్పత్రిలో వైద్యుల సహకారంతో ప్రాణాంతక ఔషధాన్ని మింగి చనిపోయారు. గుడాల్‌కు ప్రతినిధిగా వ్యవరించిన ఎగ్జిట్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధి ఈ విషయాన్ని ధృవీకరించారు. 
 
వృక్ష శాస్త్రవేత్త, పర్యావరణవేత్త అయిన గుడాల్‌ 1914 ఏప్రిల్‌లో లండన్‌లో జన్మించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన కుటుంబం ఆస్ట్రేలియాకు వలసవెళ్లింది. కాగా శాస్త్రవేత్తగా బ్రిటన్‌, అమెరికాల్లోనూ ఉన్నత హోదాల్లో పనిచేసిన గుడాల్‌.. 1979లో రిటైరయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఉన్నావో బాధితురాలిపై బీజేపీ ఎమ్మెల్యే, అతని స్నేహితుల గ్యాంగ్ రేప్ : తేల్చిన సీబీఐ