Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి అందుకే వైదొలగాను... పీవీ సింధు

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (16:17 IST)
స్టార్ బ్యాడ్మింటన్​ ప్లేయర్ పీవీ సింధు అనూహ్యంగా ఒలింపిక్స్​ ముందు వరకు కోచ్​ పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి వైదొలగింది. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సింధు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. 
ఆయనతో కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేశానని తెలిపింది. ఆ తర్వాత మా మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. కొన్ని విషయాలు నచ్చలేదని వెల్లడించింది. 
 
నటనపై ఎటువంటి ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో, ఆటపై మాత్రమే పూర్తి దృష్టి సారించాలని అకాడమీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఓ ప్లేయర్​ ఆడేటప్పుడు ఎటువంటి వివాదాలు ఉండకూడదని చెప్పింది. 
 
బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందడానికి చిన్నప్పుడు సికింద్రాబాద్‌లోని మారేడ్​పల్లి నుంచి గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీ వరకు ప్రయాణం చేయాల్సి వచ్చేదని సింధు పేర్కొంది. 
 
ఆమెను తీసుకెళ్లి.. శిక్షణ ఇప్పించి తిరిగి తీసుకొచ్చే బాధ్యతను తండ్రి రమణే తీసుకున్నారని తెలిపింది. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేసినట్లు గుర్తుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అదే ముద్రగడ పద్మనాభం పరువు తీసేలా వుంది, ఫోన్ చేస్తే వైసిపి నాయకులు లిఫ్ట్ చేయడంలేదట?!!

పిన్నెలి రామకృష్ణారెడ్డి పాత పోస్ట్ వైరల్.. పేలుతున్న జోకులు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

నాకు తెలిసి జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టరు: ఆర్ఆర్ఆర్

కారు పైకి ఎక్కి నుజ్జు నుజ్జు చేసిన ఏనుగు - video

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లవ్ మీ చిత్రం రీష్యూట్ నిజమే - అందుకే శనివారం విడుదల చేస్తున్నాం : ఆశిష్

మంచు లక్ష్మి ఆదిపర్వం పై సెన్సార్ ప్రశంస - ఐదు భాషల్లో విడుదల

తర్వాతి కథనం
Show comments