స్టార్ హీరోయిన్ రెజీనా తాజాగా "అన్యాస్ ట్యుటోరియల్"తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తుంది.
అయితే ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న "అలీతో సరదాగా" టీవీ షోలో సందడి చేసింది. ఈ షోలో మాట్లాడుతూ, "చిన్నప్పుడు స్కూల్లో యాంకరింగ్ చేసేదాన్ని. క్లాస్ లీడర్ గా ఉన్నప్పుడే అబ్బాయిలను కొట్టేదాన్ని. చాలామంది నన్ను డామినేటింగ్ అంటారు కానీ అది నా ఫిజిక్ వల్ల అయ్యుండచ్చు" అని చెప్పుకొచ్చింది రెజీనా.
"కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికి అయినా నేను వెనుకాడను. నేను ఆ పాత్రకి సూట్ అవుతాను అని నాకు అనిపిస్తే కచ్చితంగా చేస్తాను" అని చెప్పిన రెజీనా "మనాలిలో ఒక హోటల్‌లో కళ్ళకి మాస్క్ పెట్టుకొని నిద్రపోతుండగా ఎవరో నా నుదుటి మీద ముట్టుకున్నట్టు అనిపించింది. కానీ మాస్క్ తీసి చూస్తే అక్కడ ఎవరూ లేరు" అని తాను భయపడిన ఒక సంఘటనను రెజీనా గుర్తు చేసుకుంది.