మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (15:18 IST)
ప్రేమలో పడ్డామని గొప్పగా చెప్పుకోగానే సరిపోదు. ఆ ప్రేమను పది కాలాలపాటు కాపాడుకునేందుకు కూడా ప్రయత్నించగలగాలి. అప్పుడే మిమ్మల్ని ప్రేమిస్తున్న మీ ప్రియురాలికి మీరంటే చెప్పలేనంత ఆకర్షణ, ఆత్మీయత ఏర్పడుతుంది. అలాంటి ఆకర్షణ, ఆత్మీయత ఒక్కసారి కలిగిందంటే చాలు మీ ప్రేమను ఎవ్వరు విడదీయలేరు. 
 
అందుకే ప్రేమించడంతో పాటు ఆ ప్రేమను కాపాడుకోవడానికి కూడా ప్రేమికులు తప్పక ప్రయత్నించాలి. ప్రేమను కాపాడుకోవాలంటే ఏం చేయాలి అనే సందేహం మీకు కలగొచ్చు. ప్రేమను కాపాడుకోవడానికి పెద్ద పెద్ద సాహసాలేం చేయాల్సిన పనిలేదు. మీ ప్రేయసికి ఇష్టమైన విషయాలను తెలుసుకోవడం, ఆమె అభిరుచులు, ఆమె కుటుంబ వివరాలు తెలుసుకోవడం వంటివి చేయాలి. 
 
అందుకు అనుగుణంగా ఆమె మూడ్‌ను, ఆమె ఇష్టా ఇష్టాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించగలగాలి. అలా మీరు ప్రవర్తించగల్గితే మీమీద మీ ప్రేయసికి ఎక్కడలేని ప్రేమ ఉప్పొంగుతుంది. చాలామంది అబ్బాయిలు తమ ప్రేమను అమ్మాయి ఒప్పుకుందంటే చాలు.. ఇక తమ గురించి వారి వద్ద లేనిపోని గొప్పలు చెప్పేస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!

ఎబోలా వైరస్ విజృంభణ : ఆ నాలుగు దేశాలకు వెళ్లవద్దంటున్న భారత్

హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. మా కుటుంబం నుంచే మూడు ఓట్లు కూడా రావు : సల్మాన్

వేధింపులు భరించలేకే 'అమ్మ' కార్యదర్శి పదవికి రాజీనామా : అన్సిబా హాసన్

Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్

Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

Allu Arjun: అల్లు అర్జున్ శక్తిమాన్‌గా చేస్తున్నాడా?

తర్వాతి కథనం
Show comments