Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వందేళ్లకు ఒకసారే ఇలాంటి లీడర్ వస్తాడు...

Advertiesment
వందేళ్లకు ఒకసారే ఇలాంటి లీడర్ వస్తాడు...
, శుక్రవారం, 15 మార్చి 2019 (11:16 IST)
జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పి, తన జీవితాన్ని రాజకీయాలకు పూర్తిగా అంకితం చేసారు. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంటూ, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం ఏర్పాటు చేసిన సభకు హాజరైన మెగా బ్రదర్ నాగబాబు తన తమ్ముడి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
 
ఎన్నోసార్లు ప్రయత్నించినా కూడా ఏ మీటింగ్‌కు రాలేకపోయానని, ఆవిర్భావ దినోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. కళ్యాణ్ బాబు అభిమానులు, జనసైనికులు, మంచి ప్రభుత్వం రావాలని కోరుకునే ప్రతి పౌరుడికి ఇది పండగ రోజని నాగబాబు తెలిపారు. 
 
తమ్ముడు పార్టీ పెట్టినప్పుడు చాలా బాధపడ్డాం. అప్పటికే అన్నయ్య ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు మాకు తెలుసు గనుక హ్యాపీగా ఉండకుండా ఇదేం పని అని బాధపడ్డాము. కానీ జనసేన పెట్టి సంవత్సరం గడిచిన తర్వాత తన విజన్ నిజం కాబోతోందనే నమ్మకం వచ్చింది. పవన్ వంటి నాయకులు చాలా అరుదుగా పుడతారు. అన్నయ్య ఆశీస్సులు కూడా కళ్యాణ్ బాబుకు ఉన్నాయంటూ ఎమోషనల్ అయ్యాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలిఫోర్నియా గవర్నర్ సంచలన నిర్ణయం.. 737 మంది మరణశిక్షలు రద్దు