Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్.. మీకో దండం.. ఆంధ్రులను వదిలివేయండి... పవన్

Advertiesment
కేసీఆర్.. మీకో దండం.. ఆంధ్రులను వదిలివేయండి... పవన్
, శుక్రవారం, 15 మార్చి 2019 (09:14 IST)
కేసీఆర్.. మీకో నమస్కారం. రెండు చేతులు జోడించి నమస్కిస్తున్నాను. ఉమ్మడిగా ఉన్నపుడు ఆంధ్రులను తిట్టారు. ఇవాళ విడిపోయాం. ఇక ఆంధ్రులను వదిలివేయండి. శిష్టా ఆంజనేయ శాస్త్రి చెప్పినట్టుగా రాజ్యాంగబద్ధ విరోధం ఉండాలి. ప్రజల మధ్య విరోధం కాదు అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
రాజమండ్రిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్స సభలో ఆయన ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. తాను ఇంటర్మీడియట్‌తో చదువు ఆపేసినా పుస్తకాలు చదవడం మాత్రం ఆపలేదన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో చాలా మంది తనను పిచ్చోడు అన్నారు. కానీ, తాను పిచ్చోడిని కాదనీ, ముందుకు అడుగేస్తే తల తెగిపడాలే కానీ మడమతిప్పడం పవన్ కల్యాణ్ కు తెలియదన్నారు.
 
మనిషికి అన్యాయం జరుగుతుంటే ఆ మనిషి ఎవరు, ఏ కులం, ఏ మతం? అంటూ వర్గీకరణ చేసి చూడలేదని చెప్పారు. జనసేనను స్థాపించినప్పుడు తానొక్కడినే అని, కానీ ఇప్పుడు ఓ సైన్యం తన వెంట ఉందని అన్నారు. నాలుగేళ్లుగా తనను ఎన్నోరకాలుగా బెదిరించారని, అయినా వెనుకంజ వేయలేదని తెలిపారు. 
 
ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నామంటూ తెలిపారు. ముందుకు అడుగేస్తే తల తెగిపడాలే కానీ మడమతిప్పడం పవన్ కల్యాణ్ కు తెలియదన్నారు. ఇప్పుడో కానిస్టేబుల్ కొడుకు 2019లో సీఎం అవుతున్నాడని, తనకు గెలుపోటములతో సంబంధంలేదని, యుద్ధం చేయడమే తెలుసని చెప్పారు. 
 
గత ఎన్నికల సమయంలో తాను కొందరికి పల్లకీలు మోశానంటూ పరోక్షంగా టీడీపీ, బీజేపీలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను పల్లకీలు మోసింది తన కోసం కాదని, ప్రజలను అభివృద్ధి అనే పల్లకీలో ఏమైనా కూర్చోబెడతారేమో అన్న ఆశతో మోశానని తెలిపారు. కానీ కొందరు తనను వాడుకుని ప్రజలను వంచించారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద డబ్బు లేదని, అయినా ప్రజలకు మేలు చేయాలన్న బలమైన కోరికతో రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.
 
గాంధీ వద్ద ఏముందని రంగంలోకి దిగారు? భగత్ సింగ్ వద్ద ఏముందని ముందుకు ఉరికారు? నాకు కులం, ప్రాంతం ఏమీలేవు. కేవలం మానవత్వానికి ప్రతినిధిగా మాత్రమే వచ్చాను. రాయలసీమ ప్రాంతంలో నీకేం బలం ఉందంటారు? అయినా రాయలసీమలో బలం ఉందని చెప్పడానికి రియల్ లైఫ్‌లో తొడలు కొట్టి చెప్పాలా? 
 
సినిమాల్లో తొడలు కొడితే బాగుంటుంది కానీ రియల్ లైఫ్‌లో కాదు. రాయలసీమ అంటే బాంబుల సంస్కృతి అని చెబుతారే తప్ప ఏనాడైనా అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ తిరుగాడిన నేల అని ఎవరైనా చెప్పారా? వీరబ్రహ్మేంద్రస్వామికి జన్మనిచ్చిన నేల అది, పీర్ బాబా తిరిగిన నేల అది అంటూ ఆవేశంగా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్ బుక్ పరిచయం... వగలుపోతూ అడిగేసరికి సమర్పించుకున్నాడు...