Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్న ఆదాయం ఎంతో తెలుసా?

తిరుమల గిరుల్లో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామికి భక్తజనకోటి కోట్లాది రూపాయలను కానుకలుగా చెల్లిస్తుంటారు. అలా గత యేడాది భక్తులు శ్రీవారి హుండీలో చెల్లించిన కానుకల ద్వారా రూ.995.8 కోట్ల ఆదాయం వచ్చింది.

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (16:42 IST)
తిరుమల గిరుల్లో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామికి భక్తజనకోటి కోట్లాది రూపాయలను కానుకలుగా చెల్లిస్తుంటారు. అలా గత యేడాది భక్తులు శ్రీవారి హుండీలో చెల్లించిన కానుకల ద్వారా రూ.995.8 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ మొత్తం కూడా కేవలం భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారానే సమకూర్చినట్టు తెలిపారు. 
 
ఇకపోతే.. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన మాట్లాడుతూ, భక్తుల కోసం తిరుపతిలో 2500 గదులను నిర్మించనున్నామని తెలిపారు. బ్రేక్ దర్శన టిక్కెట్ల ధరను పెంచాలన్న ఆలోచనపై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని, ప్రభుత్వానికి కూడా ఎలాంటి నివేదికనూ పంపలేదన్నారు. గత సంవత్సరం మొత్తం 2,73,13,897 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 10,66,72,730 లడ్డూలను పంపిణీ చేశామని తెలిపారు.
 
మరోవైపు, కొత్త సంవత్సరంలో ఏప్రిల్ నెలకు కోటాకు సంబంధించి మొత్తం 56,593 టికెట్లు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 10,658 సేవా టిక్కెట్లు విడుదలయ్యాయి. ఇందులో సుప్రభాతం 7,878, తోమాల మరియు అర్చన 240, అష్టదళపాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2300 టికెట్లు ఉన్నాయని వివరించారు. సేవా టిక్కెట్ల బుకింగ్‌ను 4 రోజుల సమయానికి తగ్గించినట్టు తెలిపారు.
 
ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో మొత్తం 45,935 సేవాటికెట్లు కాగా, వీటిలో విశేషపూజ 1,875, కల్యాణం 11,250, ఊంజల్‌సేవ 3000, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకారసేవ 12,825 ఉన్నాయని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

లేటెస్ట్

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

తర్వాతి కథనం
Show comments