ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు...?

ధనురాశిలో నుండి మకరంలోకి రవి ప్రవేశించే సమయమే ధనుర్మాసం. అయితే ఈ మాసంలో పెళ్లిళ్లు చేయకపోవడానికి శాస్త్రపరమైన, భౌతికపరమైన కారణాలు ఉన్నాయి. ధనుర్మాసంలో ప్రజలందరూ తిరుప్పావై వ్రతాన్ని నిష్టగా పాటిస్తుంటారు. ఈ వ్రతం పాటించడానికి కొన్ని నియమాలు సాక్షాత్త

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (16:29 IST)
ధనురాశిలో నుండి మకరంలోకి రవి ప్రవేశించే సమయమే ధనుర్మాసం. అయితే ఈ మాసంలో పెళ్లిళ్లు చేయకపోవడానికి శాస్త్రపరమైన, భౌతికపరమైన కారణాలు ఉన్నాయి. ధనుర్మాసంలో ప్రజలందరూ తిరుప్పావై వ్రతాన్ని నిష్టగా పాటిస్తుంటారు. ఈ వ్రతం పాటించడానికి కొన్ని నియమాలు సాక్షాత్తూ ఆండాళ్ అమ్మవారే చెప్పారు. పాలు, నెయ్యి వంటి భోగ పదార్థాలను తినరు. పూలు అలంకరించుకోరు. కంటికి కాటుక పెట్టుకోరు. 
 
ఈ మాసంలో భోగభాగ్యాలకు దూరంగా ఉంటూ దానధర్మాలు చేస్తూ మోక్షమార్గంలో పయనిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మాసంలో వచ్చే వాతావరణ మార్పులు శరీరం మరియు ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అందుకే ఆరోగ్యం కాపాడుకునేందుకు తినే ఆహారంపై కొన్ని నియమాలు పెట్టారు. ఈ తరుణంలో శుభకార్యాలకు మానసికంగా గానీ, శారీరకంగా గానీ సంసిద్ధత ఉండదు. 
 
భోగినాడు గోదా, శ్రీ రంగనాథుల కళ్యాణంతో ఈ వ్రతం ముగుస్తుంది. అందుకే ఈ మాసంలో కళ్యాణం గానీ, శుభకార్యాలు గానీ చేయనందున దీనిని శూన్యమాసం అంటారు. ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇంటిని శుభ్రం చేసి ప్రతిరోజూ దీపారాధన చేస్తే లక్ష్మీకటాక్షం ప్రాప్తిస్తుంది. తిరుమలలో ఈ నెలరోజుల పాటు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం ఆలపిస్తారు. తిరుప్పావై పారాయణం చేస్తే పెళ్లి కాని అమ్మాయిలకు మంచి భర్త దొరికి మనస్సులోని కోరికలన్నీ నెరవేరుతాయని ప్రతీతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో వున్న ప్రజలంతా ఉచిత పథకాలతో పనిలేకుండా కుబేరులవుతారు, ఎలాగంటే?

ఆ వైద్య విద్యార్థిని అర్థరాత్రి బయటకు ఎలా వెళ్లింది : సీఎం మమతా బెనర్జీ

లక్నోలో దారుణం : బాలికపై ఐదుగురు కామాంధుల అత్యాచారం

భర్తను వదిలేసిన ఆమె.. భార్యను వదిలేసిన ఆయన.. కర్నూలులో ప్రేమికుల ఆత్మహత్య

డోనాల్డ్ ట్రంప్ సుంకాల మోతకు అదిరేది లేదు భయపడేది లేదు : చైనా

అన్నీ చూడండి

లేటెస్ట్

10-10-2025 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య తొలగుతుంది.. ఖర్చులు విపరీతం...

Atla Taddi : అట్లతద్ది.. పదేళ్లు చేయాలట... గౌరీదేవిని ఇలా పూజిస్తే..?

09-10-2025 గురువారం ఫలితాలు - ఒత్తిళ్లకు లొంగవద్దు.. పత్రాలు అందుకుంటారు...

08-10-2025 బుధవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు....

Sirimanotsavam: ఉత్తరాంధ్ర వాసుల కల్పవల్లి పైడితల్లి.. మంగళవారం రోజున సిరిమానోత్సవం

తర్వాతి కథనం
Show comments