Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధనుర్మాసంలో యోగనిద్ర నుంచి విష్ణుమూర్తి... ఉత్తర ద్వారం నుంచి...

ధనుస్సంక్రమణం డిసెంబరు 16. ఈ సంక్రమణం మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్థేశితమైనది. ఆ భగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈ భూమి పైన భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే, భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ప్రతీతి. ఆప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్న

ధనుర్మాసంలో యోగనిద్ర నుంచి విష్ణుమూర్తి... ఉత్తర ద్వారం నుంచి...
, శుక్రవారం, 15 డిశెంబరు 2017 (13:17 IST)
ధనుస్సంక్రమణం డిసెంబరు 16. ఈ సంక్రమణం మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్థేశితమైనది. ఆ భగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈ భూమి పైన భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే, భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ప్రతీతి. ఆప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వ వ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రాతీక, ఈ మాసంలో ఆండాళ్ బాహ్య అనుభవంతో అంతరానుభవంతో ముఫ్పై రోజులు భక్తి పారవశ్యం చెందుతూ పాశురాలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈ పాశురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది. ఈ మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీ కృష్టుడు భగవద్గీతలో చెబుతాడు.
 
మార్గశిర మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. భువి పైన మన సంవత్సరాన్ని దివిలో ఒకరోజుగా లెక్కించే దేవతలకు మార్గశిరం బ్రహ్మీ ముహుర్తంగా పేర్కంటారు. అంటే సూర్యోదయానికి ముందు తొంభై ఆరు నిమిషాలు. ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవనాదం అని అర్థం. ధనుస్సు నుంచి వచ్చే టంకారమే ఓంకార నాదానికి మూలం. ఈ నాదాన్ని గానంగా చేసుకొని సంకీర్తనలు చేయడం వల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు. 
 
ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆ యోగనిద్ర నుండి మేల్కొని శుద్ద త్రయోదశినాడు సకల దేవతాయుతడై బృందావనానికి చేరుకుని, ధనుర్మాసంలో వచ్చే శుద్ద ఏకాదశి నాడు ఉత్తర ద్వారము నుండి మనకు దర్శన భాగ్యమును కలిగిస్తాడు. ఆ దివ్య దర్శనం భాగ్యం వల్ల క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరతాయి. దీనినే రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలానికి సంకేతంగా చెప్తారు. ఈ ధనుర్మాసం అరంభానికి ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ది చేయాలి. ఇంటి బయట ముంగిళ్ళలో కళ్ళాపి జల్లాలి. దీనివలన అనారోగ్యకారకాలైన క్రిములు నశిస్తాయి. 
 
ఇలా పవిత్రములైన గొబ్బెమ్మల నుంచి వాటిని, పూలు, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. భగవాదారాధనను ఎన్నడూ మరువరాదనే విషయాన్ని గుర్తుచేసే హరిదాసులు నామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు. వీరిని గౌరవించినా భగవదారాధనే అవుతుంది. వృషభాన్ని అలకరించి దాన్ని ఇళ్ళముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింప చేస్తారు. ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే. అంతేకాక వృషభాల గిట్టల స్పర్శ వలన ఆ ప్రదేశం కూడ పవిత్రమవుతుంది. శంఖం భగవ స్వరూపం కనుక అందునుండి వచ్చే ధ్వని పవిత్రమవుతుంది. ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం రోజు గోపూజ అత్యంత ప్రధానమైనది. ఈ మాసం ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-12-17 దినఫలాలు... నగదుతో ప్రయాణాలు మంచిది కాదు