Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-12-17 దినఫలాలు... నగదుతో ప్రయాణాలు మంచిది కాదు

మేషం : నూతన వ్యాపారాలు, ప్రాజెక్టులు, భాగస్వామిక వ్యవహారాలు కలిసిరాగలదు. విద్యార్థులకు ఒత్తిడి, అవగాహన లోపం వంటి చికాకులు తప్పవు. మీ అవసరాలకు కావలసిన ధనం సమయానికి సర్దుబాటుకాగలదు. ఉపాధ్యాయులకు శ్రమాధ్

Advertiesment
15-12-17 దినఫలాలు... నగదుతో ప్రయాణాలు మంచిది కాదు
, శుక్రవారం, 15 డిశెంబరు 2017 (05:45 IST)
మేషం : నూతన వ్యాపారాలు, ప్రాజెక్టులు, భాగస్వామిక వ్యవహారాలు కలిసిరాగలదు. విద్యార్థులకు ఒత్తిడి, అవగాహన లోపం వంటి చికాకులు తప్పవు. మీ అవసరాలకు కావలసిన ధనం సమయానికి సర్దుబాటుకాగలదు. ఉపాధ్యాయులకు శ్రమాధ్యికత, కొత్త బాధ్యతలు తప్పవు. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు మంచిది కాదు.
 
వృషభం : కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. మీ యత్నాలు ఆశాజనకంగాను, ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్థత వల్ల అధికారులు, సహోద్యోగులే లబ్ధి పొందుతారు. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమఫలితం.
 
మిథునం : ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులకు ఏకాగ్రత, పట్టుదల ముఖ్యం. ఒక స్థిరాస్తి కొనుగోలుదిశగా మీ ఆలోచన లుంటాయి. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు మెరుగుపడటంతో పాటు అవకాశాలు కలిసివస్తాయి. ప్రతి వ్యవహారం మీ చేతుల మీదుగానే సాగుతుంది. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
 
కర్కాటకం : ఆర్థికంగా లోటు లేకున్నా తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. విద్యర్థుల లక్ష్య సాధనకు బాగా శ్రమించాలి. పారిశ్రామికవేత్తలు, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయ భేధాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి.
 
సింహం : గృహ నిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు, చేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు బలపడతాయి. అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఓర్పు, రాజీమార్గంలో మీ సమస్యలు పరిష్కరిచుకోవాలి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త అంశాలు చర్చకు వస్తాయి. రుణాలు తీరుస్తారు.
 
కన్య : ఆర్థిక విషయాలలో ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో ఒకింతనిరుత్సాహం చెందుతారు. రుణదాతల ఒత్తిడి, ఏ పనీ సక్రమంగా సాగక నిరుత్సాహం చెందుతారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పిడి, స్థానచలనం వంటి పరిణామాలున్నాయి. అన్నిచోట్ల మీ ఆధిక్యతను ప్రదర్శించటం మంచిదికాదు.
 
తుల : ఉపాధ్యాయులను పనిభారం తప్పదు. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. విద్యార్థునుల ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆత్మీయుల ఆహ్వానాలు మిమ్ములను సందిగ్ధానికి గురిచేస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృశ్చికం : కోర్టులో దావా వేసే విషయంలో పునరాలోచన మంచిది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
ధనస్సు : అనుమానాలు, అపోహలు వీడి ఆత్మవిశ్వాసంతో శ్రమించండి, సత్పలితాలు లభిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. దుబారా ఖర్చులు అధికం. స్త్రీలకు దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం : కీలకమైన ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు.
 
కుంభం : వృత్తిపరంగా ప్రజాసంబంధాలు విస్తరిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలోనూ, ప్రయాణాలలో మెళుకువ అవసరం. తొందరపడి మాట జారటం మంచిది కాదు. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో అప్రమత్తత అవసరం.
 
మీనం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేటి దినఫలాలు : సాయిబాబాను స్మరించిన మంచిది..