వివాహాలు ఎన్ని? గాంధర్వ వివాహం అని దేన్నంటారు?

మలి వేదకాలంలో వివాహ పద్దతులు -8 రకాలు. అవి ఆమోదితాలు 4. అనామోదితాలు 4. 1. బ్రహ్మ వివాహం. ఇది పెద్దలు కదిర్చిన వివాహం. గుణవంతుడు, సచ్చీలుడు అయిన వ్యక్తికి కన్యాదానం చెయ్యడాన్ని బ్రహ్మ వివాహం అంటారు. 2. దైవ వివాహము. బ్రహ్మణులకు మాత్రమే (అమ్మాయిని దక్ష

శనివారం, 8 జులై 2017 (20:42 IST)
మలి వేదకాలంలో వివాహ పద్దతులు -8 రకాలు. అవి ఆమోదితాలు 4. అనామోదితాలు 4.
 
1. బ్రహ్మ వివాహం. ఇది పెద్దలు కదిర్చిన వివాహం. గుణవంతుడు, సచ్చీలుడు అయిన వ్యక్తికి కన్యాదానం చెయ్యడాన్ని బ్రహ్మ వివాహం అంటారు.
2. దైవ వివాహము. బ్రహ్మణులకు మాత్రమే (అమ్మాయిని దక్షిణగా ఇవ్వడం)
3. ఆర్ష వివాహం. వివాహానికి ముందు కాబోయే మామగారికి ఒక ఆవును, ఎద్దును బహుకరించి కన్యను స్వీకరించే విధానాన్ని ఆర్ష వివాహం అంటారు.
4. ప్రజాపత్య వివాహం. ఆర్ధిక లావాదేవీలు లేకుండా జరిగే వివాహం. కాబోయే అల్లుడుని సత్కరించి వధూవరులిద్దరూ ధర్మస్థాపనకు పూనుకొనమని చెప్పి నిర్వర్తించే వివాహం.
 
అనామోదితాలు
1.గాంధర్వ వివాహం... ప్రేమ వివాహం, వివాహానికి ముందు పరస్పరం ప్రేమించుకొని వివాహమాడే విధానం.
2. అసుర వివాహం... పెళ్ళికూతురుని కొనడం ద్వారా వివాహమాడటం.
3. రాక్షస వివాహం... అమ్మాయి ఇష్టం లేకుండా ఆమెను ఆమె తల్లిదండ్రుల నుంచి దొంగిలించి తీసుకువచ్చి పెళ్ళి చేసుకొవడం.
4. పైశాచ వివాహం... నిద్రిస్తున్న కన్యనుగాని, మానసిక స్థితి సరిగాలేని కన్యనుగాని, బలవంతంగా వివాహం చేసుకోవడం.
 
కలాంతర వివాహాలు 2 రకాలు.
అనులోమవివాహం... పైకులంలో ఉన్న యువకుడు క్రింది కులంలోని యువతిని పెళ్ళి చేసుకోవడం.
ప్రతిలోమ వివాహం... క్రింది స్థాయి కులంలో యువకుడు పైస్థాయి కులంలో యువతిని పెళ్ళిచేసుకోవడం.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జూలై 9 గురుపూర్ణిమ... ఏం చేయాలి?