Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులు మీ డబ్బులు రీఫండ్, 2021 డైరీలు, క్యాలెండ‌ర్లు ఆన్‌లైన్‌లో, ఎలా?

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (20:04 IST)
లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి 13 నుండి జూన్ 30వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ (tirupatibalaji.ap.gov.in) ద్వారా గానీ, పోస్టాఫీసు, ఇ-ద‌ర్శ‌న్ మరియు ఎపి ఆన్లైన్ కౌంట‌ర్ల ద్వారా గానీ శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, వ‌స‌తి గదులను బుక్ చేసుకున్న భ‌క్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్ పొందేందుకు డిసెంబరు 31వ తేదీ వరకు టిటిడి మరో అవకాశం కల్పించింది.
 
ఈ మేర‌కు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు వాటిని ఆన్‌లైన్‌లోనే రద్దు చేసుకునే అవకాశం కల్పించారు. పోస్టాఫీసు, ఈ-దర్శన్ కౌంటర్లు మరియు ఎపి ఆన్లైన్ కౌంట‌ర్ల ద్వారా బుక్ చేసుకున్న భ‌క్తులు సంబంధిత టికెట్ వివ‌రాల‌తోపాటు, బ్యాంకు ఖాతా నంబ‌రు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివ‌రాల‌ను excel టెక్ట్స్‌లో‌ టైపు చేసి refunddesk_1@tirumala.org మెయిల్ ఐడికి పంపాల‌ని టిటిడి కోరుతోంది. మెయిల్ వివ‌రాల ఖ‌చ్చిత‌త్వాన్ని ప‌రిశీలించిన అనంత‌రం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భ‌క్తుల ఖాతాల్లోకి జ‌మ చేస్తారు.
 
టికెట్లు రద్దు చేసుకుని రీఫండ్ పొందడానికి ఇష్టపడని భక్తులు డిసెంబరు 31వ తేదీలోపు వారికి అనువైన తేదీల్లో ఆ టికెట్లు చూపి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ రెండు అవకాశాల్లో ఒకదాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరడమైనది. టిటిడి ముద్రించిన 2021 డైరీలు, క్యాలెండ‌ర్లను భ‌క్తులు ఆన్‌లైన్‌(tirupatibalaji.ap.gov.in) ద్వారా బుక్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించ‌డ‌మైన‌ది. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని టిటిడి ఒక ప్రకటనలో కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో ఏ రాశుల వారికి శుభకరంగా వుంటుందో తెలుసా?

21-11-2024 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

భైరవ అష్టమి మహోత్సవం, 2024 రకాల మిఠాయిల భోగం, 84,000 చదరపు అడుగుల రంగోలీ ప్రపంచ రికార్డు

20-11-2024 బుధవారం ఫలితాలు - గృహం ప్రశాంతంగా ఉంటుంది...

19-11-2024 మంగళవారం ఫలితాలు - పిల్లల దూకుడు కట్టుడి చేయండి....

తర్వాతి కథనం
Show comments