Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఎస్వీబీసీ చానెల్ ఛైర్మన్‌గా మాడీ ఎమ్మెల్యే యాచేంద్ర

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (09:08 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవలు, కైంకర్యాలు, ఆధ్యాత్మిక ప్రచారం కోసం తిరుమల తిరుపతి దేవస్థాన్ (తితిదే) ఎస్వీబీసీ పేరుతో ఓ భక్తి చానెల్ నడుపుతోంది. ఈ చానెల్ ఛైర్మన్‌గా నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే వీబీ సాయికృష్ణ యాచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చుట్టూ అనేక వివాదాలు నెలకొన్న విషయం తెల్సిందే. సినీ నటుడు పృథ్వీని తొలుత ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమించారు. కానీ, ఆయన భక్తి సేవలో తరించకుండా మహిళల సేవలో తరించారు. దీనికిని సంబంధించిన ఆడియో ఒకటి లీక్ కావడంతో ఆయన్ను పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది.
 
ఆ తర్వాత అయోధ్య రామమందిరం శంకుస్థాపన కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయకపోవడంతో నలువైపుల నుంచి ఎస్వీబీసీ విమర్శలను ఎదుర్కొంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో వైకాపాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర బాధ్యతలను చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

లేటెస్ట్

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

తర్వాతి కథనం
Show comments