Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త వివాదంలో తితిదే - లవుడు ఒక్కడే.. కుశడు కాదా? (video)

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (16:45 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. తితిదే ఆధ్వర్యంలో ప్రచురితమయ్యే సప్తగిరి మాసపత్రికలో భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం ప్రచురితమైంది. సీతారాములకు ఒక్కరే కుమారుడని పేర్కొంది. సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ జానపద కథలో కథనం ప్రచురితమైంది. ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాశాడు. 
 
ఈ వార్త చూడగానే బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆగ్రహం వ్యక్త చేస్తూ, ఆందోళనకు దిగారు. తితిదే వంటి ధార్మిక సంస్థ వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జానపదాల్లో రకరకాల ప్రచారాలపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతందని వారు తెలిపారు. ఈ వ్యవహారంపై భక్తులు కూడా తితిదేపై మండిపడుతోంది.
 
ఇటీవలే తితిదే ఓ వివాదం నుంచి బయటపడింది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి నిరర్ధక ఆస్తులను విక్రయించాలని తితిదే నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో తితిదే తన నిర్ణయంపై వెనక్కి తగ్గింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Army: నేపాల్‌లో కొనసాగుతున్న అశాంతి.. అమలులో కర్ఫ్యూ- రంగంలోకి సైన్యం

నేపాల్‌లో చిక్కుకున్న 187మంది- రక్షణ చర్యల కోసం రంగలోకి దిగిన నారా లోకేష్

ముద్రగడ పద్మనాభంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ.. ఇంటికెళ్లి మరీ.. (video)

Cyber: తమిళనాడులో భారీ సైబర్ మోసాలు.. రూ.1,010 కోట్లు గోవిందా

మేము ఫ్రెండ్స్.. భేటీకి రెడీ.. ట్రంప్- మోదీ ప్రకటన.. కానీ 100 శాతం సుంకాలు?

అన్నీ చూడండి

లేటెస్ట్

చంద్రగ్రహణం: శుద్ధి కార్యాల తర్వాత ఏపీ-తెలంగాణల్లో తెరుచుకున్న దేవాలయాలు

08-09-2025 సోమవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

07-09-2025 నుంచి 13-09-2025 వరకు మీ వార రాశి ఫలితాల

07-09-2025 ఆదివారం ఫలితాలు - ఆరోగ్యం బాగుంటుంది.. దైవదీక్షలు స్వీకరిస్తారు...

చంద్రగ్రహణం సమయంలో పఠించాల్సిన శ్లోకం

తర్వాతి కథనం
Show comments