తితిదే గోశాలలో గోపూజ.. చిన్ని క్రిష్ణుడు చిద్విలాసం

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (22:45 IST)
గోకులాష్టమి సంధర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ గోశాలలో బుధవారం గోపూజలు నిర్వహించారు. టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తొలుత శ్రీక్రిష్ణస్వామి ఆలయంలో స్వామివారికి నిర్వహించిన పూజలో పాల్గొన్నారు.
 
ఆ తరువాత అర్చకుల ఈఓ సింఘాల్‌కు వరిపట్టం కట్టి సాంప్రదాయబద్ధంగా గోపూజా మందిరానికి తీసుకెళ్ళారు. అలంకరించిన గోవుకు ఈఓ పూలమాలలు వేసి పసుపు, కుంకుమతో అలంకరించి అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య గోపూజ నిర్వహించారు. 
 
ఆ తరువాత గోవులకు దాణా పెట్టారు. కోవిడ్ -19 నేపథ్యంలో చాలా పరిమిత సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో అభిషేకం, అర్చనలు జరిగాయి. తిరుమలలో కూడా శ్రీక్రిష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. 
 
గోగర్భం డ్యాం చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్థనుడు అయిన శ్రీక్రిష్ణునికి ఉదయం 10గంటల నుంచి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, కుంకుమ, చందనం, పంచామృతాభిషేకాలు చేశారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రెండు రోజుల్లో వివాహం.. అంతలోనే విగతజీవిగా వరుడు

తుపాకీతో ట్రంప్, నా సంగతి సరిగా తెలీదు, నేను మంచోడిగా వుండను

మీరు చూస్తుండండి, తమిళనాడు అధికార పీఠం టీవీకే విజయ్‌దే, ఎవరు?

పెళ్లి వేడుకలో విషాదం, నృత్యం చేస్తూనే గుండెపోటుతో కుప్పకూలి వధువు మృతి, వీడియో

TVK విజయ్ చేజేతులా డీఎంకేకి అధికారం అప్పగించేస్తున్నారా? పవన్‌ను ఫాలో అయితే బాగుండేదేమో?!!

అన్నీ చూడండి

లేటెస్ట్

26-04-2026 నుంచి 02-05-2026 వరకు ఫలితాలు - అహంకారం ప్రదర్శించవద్దు

ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. నివేదిక సిద్ధం..జూన్ 30న సమర్పణ

25-04-2026 శనివారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చుచేయండి

శ్రీవారికి కానుకగా 753 గ్రాముల బంగారు పతకాలను ఇచ్చిన బెంగళూరు భక్తురాలు

తర్వాతి కథనం
Show comments