Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి కీర్తిని నలువైపులా వ్యాప్తి చేసేందుకు టిటిడి కీలక నిర్ణయం?

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (20:04 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామి కీర్తిని నలుదిక్కుల వ్యాప్తి చేసే విధంగా దేవాలయాలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది టిటిడి పాలకమండలి. బాంబేలో దేవాలయం నిర్మాణం చేపట్టనున్నారు. వారణాసిలో దేవాలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వాన్ని స్థలం కేటాయింపుకు అనుమతులను కోరనున్నారు.
 
అలాగే జమ్మూ కాశ్మీర్‌లో కూడా ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. టిటిడిలో ఆదాయాన్ని పెంచేందుకు కొన్ని నిర్ణయాలను కూడా తీసుకున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ పైన కార్పస్ ఫండ్స్‌లో కొన్ని మార్పులు తీసుకురానున్నట్లు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు.
 
బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలోనే చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే వైజాగ్‌లో శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తి చేసినట్లు ఛైర్మన్ చెప్పారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. 
 
రూ. 4.95 కోట్లతో వైజాగ్ శ్రీవారి ఆలయంకు ఘాట్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. టిటిడి ఉద్యోగులకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. కోవిడ్ సమయంలో వివిధ సేవా కార్యక్రమాలలో బుక్ చేసుకున్న భక్తులు అయోమయంలో ఉన్నారని.. ఉదయాస్తమాన సేవలు బుక్ చేసుకున్న భక్తులకు విఐపి బ్రేక్ సేవ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
గోల్డ్, క్యాష్ డిపాజిట్లు సంబంధించి అధిక వడ్డీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతినెలా డిపాజిట్ పై వడ్డీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తిరుపతిలో రేపటి నుంచి మూడువేల ఉచిత దర్సన టోకెన్స్ జారీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు టిటిడి ఛైర్మన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

23-05-2025 శుక్రవారం దినఫలితాలు - అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు...

22-05-2025 గురువారం దినఫలితాలు - పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది...

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

21-05-2025 బుధవారం దినఫలితాలు - వృధా ఖర్చులు తగ్గించుకుంటారు....

తర్వాతి కథనం
Show comments