Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖండ పారాయ‌ణంతో పులకించిన తిరుమలగిరులు, ఎందుకు చేశారంటే?

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (21:07 IST)
ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై గురు‌‌వారం ఉద‌యం జరిగిన సుందరకాండలోని అష్ట‌మ‌ సర్గ నుంచి ఏకాద‌శః సర్గ వరకు ఉన్న మొత్తం 182 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితుల అఖండ పారాయ‌ణంతో తిరుమ‌లగిరులు పుల‌కించాయి. 
 
ఈ సంద‌ర్భంగా రాష్ట్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉపకుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ‌ మాట్లాడుతూ వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన రామ‌య‌ణంలోని సుంద‌ర‌కాండ‌లో నాయ‌కుడు హ‌నుమంతుడ‌ని తెలిపారు. హ‌నుమంతుడిని స్మ‌రించ‌డం వ‌ల‌న బుద్ధి, బ‌లం, దైర్యం, భ‌యం లేక పోవ‌డం, స‌ఖ‌ల జీవులు ఆయురారోగ్యాల‌తో ఉంటాయ‌న్నారు. టిటిడి సుంద‌ర‌కాండ పారాయ‌ణాన్నిఅద్భుతంగా, ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తు‌న్న‌ట్లు తెలిపారు. 
 
ప్ర‌తి రోజు ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించి పాల్గొంటున్న‌ట్లు తెలిపారు. శ్రీ‌వారి అనుగ్ర‌హం వ‌ల‌న త్వ‌ర‌లో క‌రోనా వైర‌స్ న‌శించి ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో ఉండాల‌న్నారు. సుందరకాండ పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్న తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ ‌ప్ర‌పంచ ప్ర‌జ‌ల యోగ‌ క్షేమం కొర‌కు టిటిడి 140 రోజులుగా శ్రీ‌వారి అనుగ్ర‌హంతో మంత్ర పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌స్తున్న‌ట్లు తెలిపారు. 
 
సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో అష్ట‌మ స‌ర్గ వ‌ల‌న అష్టసిద్ధులు, న‌వ స‌ర్గ వ‌ల‌న న‌వ‌నిధులు  సిద్ధిస్తాయ‌ని, ద‌శ‌మ స‌ర్గ వ‌ల‌న 5 -క‌ర్మ‌, 5- జ్ఞానేంద్రియాలను అ‌దుపులో ఉంచుకోవ‌చ్చ‌ని, ఏకాద‌శః సర్గ పారాయ‌ణం వ‌ల‌న మ‌న‌స్సులోని మాలిన్యాలు తొల‌గిపోతాయ‌ని వివ‌రించారు. అఖండ పారాయ‌ణంలో మొద‌టి ప‌ర్యాయం ప్ర‌థ‌మ‌స‌ర్గ‌లోని 211 శ్లోకాల‌ను, 2వ ప‌ర్యాయం ద్వితీయ సర్గ నుంచి సప్తమ సర్గ వరకు ఉన్న మొత్తం 227 శ్లోకాలను, 3వ ప‌ర్యాయం అష్ట‌మ‌ సర్గ నుంచి ఏకాద‌శః సర్గ వరకు ఉన్న మొత్తం 182 శ్లోకాలను పారాయ‌ణం చేసిన‌ట్లు తెలిపారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో సుంద‌ర‌కాండ‌లోని 68 స‌ర్గ‌ల‌లోని  2821  శ్లోకాల‌ను మొత్తం 16 ప‌ర్యాయ‌లు అఖండ పారాయ‌ణం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. సుంద‌ర‌కాండ   పారాయ‌ణం చేయ‌డం వ‌ల‌న ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయ‌ని వివ‌రించారు.
 
కాగా టిటిడి ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి వంద‌న బృందం "జయ రాఘ‌వోత్త‌మ ప్ర‌భో జ‌గ‌న్మోహ‌న... భ‌య నివార‌ణ హ‌రే... జ‌య జానకి ప‌తే......"అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ప్రారంభంలో, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ బి.ర‌ఘునాథ్, శ్రీ భాస్క‌ర్‌ బృందం " శ్రీ హ‌నుమ‌..... జై హ‌నుమ.... అంజ‌న త‌న‌య జ‌య హ‌నుమ..‌.." అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ముగింపులో సుమ‌ధురంగా ఆల‌పించారు.
 
అఖండ పారాయ‌ణంలోని అష్ట‌మ‌ సర్గ నుంచి ఏకాద‌శః సర్గ వరకు ఉన్న మొత్తం 182 శ్లోకాలను శ్రీ ప‌వ‌న్‌కుమార్ శ‌ర్మ‌, శ్రీ శేషాచార్యులు పారాయ‌ణం చేశారు. ఈ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణదారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

శనివారం కాలాష్టమి: నల్ల శునకాలకు రొట్టెలు.. ఇప్పనూనెతో దీపం

2025 కర్కాటక రాశికి కలిసొస్తుందా? వృత్తి జీవితం ఎలా వుంటుంది?

2025లో మిథునరాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే? కష్టం ఫలిస్తుందా?

2025లో వృషభ రాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే?

2025 మేషరాశి వారి కెరీర్, ఉద్యోగం, వ్యాపారం ఎలా వుంటుందంటే?

తర్వాతి కథనం
Show comments