Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (21:58 IST)
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా సోమ‌వారం శాస్త్రోక్తంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హించారు. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేప‌ట్టారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ త‌రువాత‌ యాగశాల వైదిక కార్యక్రమాలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె,  కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. 
 
అనంత‌రం మూల విరాట్‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి, శ్రీ ఆండాళ్ అమ్మవారికి, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వార్‌కు, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారికి, ధ‌్వ‌జ‌స్థంభం, ఇత‌ర ప‌రివార‌ దేవ‌త‌ల‌కు ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హించారు. కాగా రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు జరుగ‌నున్నాయి.
 
ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ మాట్లాడుతూ సంవత్సరం పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలియక జరిగేదోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తార‌న్నారు. ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తొంద‌న్నారు. ఇందులో భాగంగా ఆది‌వారం ప‌విత్ర ప్ర‌తిష్ట, సోమ‌వారం ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హించారని చెప్పారు. మంగ‌ళ‌వారం మ‌హా పూర్ణాహూతితో ప‌విత్రోత్స‌వాలు ముగుస్తాయ‌ని తెలిపారు.  ‌  కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హించారు.
 
శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
తిరుమల శ్రీవారికి సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు వార్షి‌క బ్రహ్మోత్సవాలు, అక్టోబ‌రు 16 నుండి 24వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించే న‌వ‌రాత్రి  బ్రహ్మోత్సవాల‌ను పురస్కరించుకుని సెప్టెంబరు 15వ తేదీ మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.
 
సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
 
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. కోవిడ్- 19 నిబంధ‌న‌లకు అనుగుణంగా ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని  నిర్వ‌హించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments