Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో మళ్ళీ చిరుతపులి ప్రత్యక్షం, ఈసారి ఎక్కడంటే?

తిరుమలలో మళ్ళీ చిరుతపులి ప్రత్యక్షం, ఈసారి ఎక్కడంటే?
, బుధవారం, 2 సెప్టెంబరు 2020 (22:17 IST)
తిరుమలలో జంతువుల సంచారం ఎక్కువగా కనబడుతోంది. నిత్యం రద్దీగా వుండే తిరుమల గిరులు భక్తులు లేక ఖాళీగా వుండటంతో జంతువులు యథేచ్ఛగా తిరిగేస్తున్నాయి. జింకలు, అడవిపందులు, చిరుతలు ఇలా తిరుమలలో జనం తిరిగే ప్రాంతంలోనే ప్రత్యక్షమవుతున్నాయి.
 
తిరుమలలోని పద్మావతినగర్ లోని అశ్విని ఆసుపత్రి వద్ద అర్థరాత్రి చిరుత సంచరించింది. ఇది మ్యూజియంకు సమీపంలో ఉంది. తిరుమలకు వచ్చే భక్తుల్లో ఎక్కువమంది ఈ ప్రాంతంలోనే దిగుతుంటారు. అయితే అలాంటి ప్రాంతంలో పెద్దగా జనం లేకపోవడంతో చీకటి అయితే చాలు తిరుమల మొత్తం నిర్మానుషం మారిపోవడంతో జంతువులు వచ్చేస్తున్నాయి.
 
వెలుతురు ఎక్కువగా ఉన్నా సరే నిర్మానుషమైన వాతావరణం కావడంతో జంతువులు ఇష్టానుసారం తిరిగేస్తున్నాయి. గత వారంరోజుల క్రితమే తిరుమల ఘాట్ రోడ్డులోనే చిరుత వాహనదారులపై దాడి చేసింది. అలాగే తిరుపతిలోని రెండు ప్రాంతాల్లో చిరుత హల్చల్ చేసింది.
 
ఇది కాస్త స్థానికులకు, భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చిరుతను దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు అటవీశాఖాధికారులు ప్రయత్నం చేశారు. కానీ చివరకు చిరుత జాడను గుర్తించలేకపోయారు. తాజాగా చిరుత తిరుమలలో మళ్ళీ ప్రత్యక్షమవడం.. అది కాస్తా సిసి.టివి ఫుటేజ్‌లో బయట పడటంతో భక్తుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

7 నుంచి మెట్రో రైల్ సేవలు.. తెలుసుకోవాల్సిన అంశాలివే....