వైకుంఠ ఏకాదశి రోజు ఎన్ని గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించారు?

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (17:34 IST)
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో వేకువజామున 12:21 గంటలకు వైకుంఠద్వారాలను తెరిచింది టీటీడీ. ప్రత్యేక పూజలు, నివేదన అనంతరం తొలుత వైకుంఠద్వార ప్రదక్షిణ చేసిన జీయంగార్లు, అర్చకులు, అధికారులు దర్శనం చేసుకున్నారు. నేటి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరచే ఉంచనుంది టీటీడీ.

 
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు, త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ దంపతులు, హైకోర్టు జడ్జిలు జస్టీస్ ఈశ్వరయ్య, జస్టిస్ కృష్ణమోహన్, జస్టీస్ దుర్గ ప్రసాద్, జస్టీస్ రమేష్‌లు స్వామి సేవలో పాల్గొన్నారు.

 
అలాగే ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఏపీ మంత్రులు మేకపాటి గౌతం రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, రంగనాథ రాజు, ఆదిమూలం సురేష్, అనిల్ కుమార్ యాదవ్,అవంతి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి. మాజీ హోంమంత్రి, టీడీపీ నేత నిమ్మకాయల చిన్నరాజప్ప, రాజ్యాభ సభ్యుడు సీఎం రమేష్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్ శ్రీనివాసులు, తెలంగాణ మంత్రులు హరీష్ రావ్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి  డీకే అరుణలు దర్సించుకున్నారు.

 
అంతేకాకుండా వైసిపీ ఎమ్మెల్యేలు రోజా, శిల్పా చక్రపాణి రెడ్డి, సినీ దర్శకుడు మారుతి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,మార్గాని భరత్, బిజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణా తెలుగు మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మి పార్వతిలు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YouTube వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీ, ఉద్యోగం వదిలేసేవారికి రెడ్ కార్పెట్

Minor girl: మైనర్ బాలికపై కారు పోనిచ్చాడు.. జస్ట్ మిస్.. ఏం జరిగిందో తెలుసా? (video)

కర్నూలు బస్సు ప్రమాదంలో మూడవ వాహనం ప్రమేయం వుందా?: పోలీసులు అనుమానం

ఇన్‌స్టాలో పరిచయం, 17 ఏళ్ల బాలుడితో 17 ఏళ్ల బాలిక శారీరకంగా కలిసారు, గర్భం దాల్చింది

పోలీసులు వచ్చారని నదిలోకి దూకేసిన పేకాటరాయుళ్లు.. ఒక వ్యక్తి మాత్రం?

అన్నీ చూడండి

లేటెస్ట్

29-10-2025 బుధవారం దినఫలితాలు -

Pushpayagam : అక్టోబర్ 30న తిరుమలలో పుష్పయాగం

కార్తీక మాసం గురించి శ్రీకృష్ణుడు ఏమి చెప్పారో తెలుసా?

నవంబరు 2025లో ఈ 5 రాశుల వారికి గడ్డుకాలం, ఈ పరిహారాలతో పరిష్కారం

28-10-2025 మంగళవారం దినఫలాలు - ఈ రోజు గ్రహస్థితి బాగుంది

తర్వాతి కథనం
Show comments