ఈ నెల 12నే బక్రీద్?? తేల్చి చెప్పిన రుయత్ ఏ హిలాల్ కమిటీ

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (13:31 IST)
ముస్లిం సోదరులు జరుపుకునే పండగల్లో ఒకటైన బక్రీద్ ఈ నెల 12వ తేదీనేని రుయత్ ఏ హిలాల్ కమిటీ ఖ్వాజీ ముస్తాక్ మదానీ స్పష్టం చేశారు. ముస్లీం సోదరులకు అతి పవిత్రమైన పండుగలలో బక్రీద్ ఒకటి. అటువంటి పడుగ ఎప్పుడు చేసుకోవాలనే విషయం నెలవంక మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో బక్రీద్ పండుగకు సంబంధించి నెలవంక శనివారం కనబడిందని నెలవంక కనబడిన 10 రోజులకు బక్రీద్ పండుగను జరుపుకుంటామని తెలిపారు. 
 
అంటే ఈ నెల 12వ తేదీన జరుపుకోవాలని రుయత్ ఎ హిలాల్ కమిటీ సభ్యులు ఖ్వాజీ మోలానా ముస్తక్ మదాని తేల్చి చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నెలవంక కనబడింది కాబట్టి అందులో భాగంగా ఇవాల్టి నుండి సరిగ్గా 10 రోజులలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని తెలిపారు. కొన్ని క్యాలెండర్‌‌లలో 12వ తేదీ అని మరికొన్ని క్యాలెండర్‌‌లలో 13 తేదీగాను ఉందని మీరు ఎటువంటి అయోమయానికి గురికాకుండా 12వ తేదినే పండుగ జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐబొమ్మ కేసు : పోలీస్ కస్టడీకి ఇమ్మడి.. కోర్టు అనుమతి

చిప్స్ ప్యాకెట్‌లోని చిన్న బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

రెండు నెలల క్రితం వివాహం జరిగింది.. నా భార్య 8 నెలల గర్భవతి ఎలా?

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

తర్వాతి కథనం
Show comments