ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్నారా..? ఐతే ఈ వార్త చదవాల్సిందే..

బుధవారం, 24 జులై 2019 (12:49 IST)
ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు తప్పకుండా ఈ వార్త చదవాల్సిందే. వేతనాలను పొందే వారు, వ్యాపారాల ద్వారా ఆదాయం పొందేవారు టాక్స్ ఆడిట్ నెట్ నుంచి ఈ ఏడాది ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ఎక్కువ సమయం వుంటుందని ఆదాయ పన్ను శాఖ తాజా ప్రకటనలో తెలిపింది.


ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్స్ (సీబీడీటీ) 2019-20 అసెస్‌మెంట్ ఇయర్ కోసం.. అసెస్‌మెంట్ కేటగిరీల కోసం ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు గడువు తేదీని ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించింది. 
 
అంతకుముందు ఈ తేదీ జూలై 31 వరకే పరిమితం అయ్యింది. ఈ తేదీలోపు ఐటీ రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంది. కానీ ఆ తేదీని నెలపాటు పొడిగిస్తూ సీబీడీటీ ప్రకటించింది. ఫైనాన్షియల్ ఇయర్ 19 కోసం టీడీఎస్ స్టేట్మెంట్ జారీ చేయడంలో జాప్యం కారణంగా గడువు పొడిగించాలని డిమాండ్లు రావడంతో సీబీడీటీ జూలై 31 వరకు పరిమితమై ఐటీ రిటర్న్ తేదీని ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని ఆదాయ పన్ను చట్టం 1961, సెక్షన్ 119 కింద అమలు చేస్తున్నట్లు సీబీడీటీ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పవర్ స్టార్‌కు పరుచూరి సలహా.. ఎంజీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటారా?