పిల్లలకు కేశఖండన తిరుమలేశుని వద్ద ఎందుకు చేస్తారో తెలుసా?

దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో వున్న శిశువు తన తల ద్వారా భూమిపైకి

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (21:49 IST)
దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో వున్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకు ఉన్న‌ తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు వుంటాయి. అందుకనే చిన్న వయసులోనే కేశ ఖండన కార్యక్రమం నిర్వహిస్తారు.
 
పాపాలను కలిగి వున్నందునే శిరోజాలను ‘శిరోగతాని పాపాని’ అంటారు. భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒకరకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన వుంది.  సైంధవుడని సంహరించేందుకు భీముడు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు. కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు. అతన్ని వధించడం ధర్మ సమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే, తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు.
 
తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కల్యాణకట్ట అంటారు. మన సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలు అంటారు. అందుకనే క్షవరం అనే బదులు కల్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానీకుడు సూచించారు. దీంతో కల్యాణమనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కల్యాణకట్టగా స్థిరపడింది. వేం అంటే పాపాలు.. కట అంటే తొలగించేవాడు. అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలౌ వేంకటనాయక అంటారు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు అర్థమయ్యిందా దేవుడికి తలనీలాలు ఎందుకిస్తారో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

26-10-2025 నుంచి 02-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

karthika somavaram కార్తీక సోమవారం ఈశ్వరుణ్ణి పూజిస్తే సత్వరమే ప్రసన్నం

25-10-2025 శనివారం దినఫలాలు - గ్రహాల సంచారం అనుకూలం

పంచమి రోజున వారాహి పూజ... ఏ రాశుల వారు ఆమెను పూజించాలి.. తెలుపు బీన్స్?

2026 పూరీ జగన్నాథుని రథయాత్రతో ప్రారంభం.. సేంద్రియ బియ్యంతో మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments