Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

ఆది నా కొడుకు కాదు.. దేవుని బిడ్డ - సాయికుమార్(వీడియో)

విలక్షణమైన డైలాగ్‌లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుల్లో సాయికుమార్ ఒకరు. ఒకప్పుడు సాయికుమార్ సినిమాలో లేడంటే సినిమా లేదు అన్న ప్రచారం కూడా జరిగింది. ఏదో ఒక క్యారెక్టర్లో సాయికుమార్‌ను పెడితే ఆ సినిమా హిట్టవుతుందన్న నమ్మకం దర్శకులకు ఉండేది. అందుకే ప

Advertiesment
Actor Saikumar
, శనివారం, 10 ఫిబ్రవరి 2018 (16:47 IST)
విలక్షణమైన డైలాగ్‌లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుల్లో సాయికుమార్ ఒకరు. ఒకప్పుడు సాయికుమార్ సినిమాలో లేడంటే సినిమా లేదు అన్న ప్రచారం కూడా జరిగింది. ఏదో ఒక క్యారెక్టర్లో సాయికుమార్‌ను పెడితే ఆ సినిమా హిట్టవుతుందన్న నమ్మకం దర్శకులకు ఉండేది. అందుకే ప్రత్యేకంగా సాయికుమార్ కోసం ఒక క్యారెక్టర్‌ను సిద్థం చేసేవారు కూడా. 
 
సాయికుమార్‌కు దేవుడంటే ఎంతో భక్తి. తిరుమల శ్రీవారు అంటే ఎనలేని నమ్మకం. అందుకే తను నటించిన సినిమా విడుదలైనా, తన కొడుకు ఆది నటించిన సినిమా విడుదలైనా వెంటనే తిరుమలకు వచ్చి శ్రీవారిని ప్రార్థిస్తుంటారు. ఆది యువ కథనాయకుడిగా తెలుగు చిత్రపరిశ్రమలో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి సాయికుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
ఆలయం వెలుపల సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆది తన కొడుకు కాదని, శ్రీవారు ప్రసాదించిన బిడ్డని చెప్పారు. స్వామివారు దయ మా కుటుంబం మీద ఎప్పుడూ ఉంటుందని, అందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఆపరేషన్ గోల్డ్ ఫిష్, నాపేరే సూర్య సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నానని చెప్పారు సాయికుమార్. ఈడు-జోడు సినిమాతో పాటు మరో రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పారు నటుడు ఆది. వీడియో చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరిలో విశాల్ పెళ్లి.. నడిగర్ సంఘం కొత్త భవనంలోనే.. వధువు వరమ్మేనా?