Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరికాయ కొట్టాక అందులో పువ్వు కనబడితే ఏమవుతుంది?

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (18:02 IST)
పూజ చేసేటపుడు మనం కొబ్బరికాయలు కొడుతుంటాం. చాలాసార్లు కొబ్బరికాయలు మంచివిగానే వుంటాయి. కానీ కొన్నిసార్లు కొబ్బరికాయ కుళ్లిపోయినది వస్తుంది. కొబ్బరికాయ కొట్టగానే కుళ్లిపోయిందే అని గాభరా పడతారు చాలామంది. నిజానికి పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదని అంటున్నారు జ్యోతిష నిపుణులు. 
 
ఇది మనం తెలిసి చేసిన పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదే కాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం.
 
అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినాసరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.
 
అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు కొన్ని కొబ్బరికాయల్లో పువ్వు కనిపిస్తుంది. ఇలా పువ్వు కనబడినా కొందరు ఆందోళన పడతారు. కానీ కొబ్బరికాయలో పువ్వు కనబడితే సంతానభాగ్యం అనే విశ్వాసం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండా సురేఖ, సీతక్క, రేవంత్ నోరును ఫినాయిల్‌తో కడగాలి- కేటీఆర్

ఈ వీడియో చూస్తే పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్లు పెట్టరు? (వీడియో)

షాపింగ్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన 37 ఏళ్ల వ్యక్తి.. ఎక్కడ? (video)

సమంతను నా దగ్గరకు పంపమన్న కేటీఆర్.. ఆమె నో చెప్పడంతో విడాకులు.. కొండా సురేఖ (video)

ముగ్గురు దొంగలకు చుక్కలు చూపించిన మహిళ.. తలుపు తెరవనీయలేదుగా (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

బతుకమ్మ పండుగ విశిష్టత.. పసుపు రంగు పూలతో పేర్చి...

30-09-2024 సోమవారం దినఫలితాలు : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం...

29-09-2024 ఆదివారం దినఫలితాలు : కొత్త వ్యక్తులతో జాగ్రత్త.. వాదనలకు దిగవద్దు...

29-09-2024 నుంచి 05-10-2024 వరకు మీ వార రాశి ఫలాలు

28-09-2024 శనివారం దినఫలితాలు : నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది...

తర్వాతి కథనం
Show comments