Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామానాయుడు బ‌యోపిక్ రానుందా..? వెంకీ రియాక్ష‌న్..?

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (21:39 IST)
టాలీవుడ్‌లో మహానటి సావిత్రి బయోపిక్ తర్వాత ఎన్టీఆర్ బ‌యోపిక్ రావ‌డం తెలిసిందే. దీంతో బ‌యోపిక్‌ల టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎ.ఎన్.ఆర్ బ‌యోపిక్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఎస్వీఆర్ బ‌యోపిక్ తీస్తే బాగుంటుంద‌ని.. రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్నారు. ఎస్వీఆర్ పాత్ర‌కు ప్ర‌కాష్ రాజ్ అయితే న్యాయం చేస్తాడ‌ని చెప్పారు. ఇదిలా ఉంటే... మరికొన్ని బయోపిక్‌లకు కూడా సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామానాయుడు బయోపిక్ పైన అందరి దృష్టి పడింది.
 
తాజాగా రామానాయుడు బయోపిక్ పైన వెంకటేష్ స్పందించాడు. ప్రస్తుతం ఎఫ్2 ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న వెంక‌టేష్‌ని రామానాయుడు బయోపిక్ పైన విలేఖరి అడిగిన ప్రశ్నకు స్పందించారు. ఇంత‌కీ వెంకీ ఏమ‌న్నారంటే... నాన్నగారి బయోపిక్ గురించి ఇంకా ఏమి ఆలోచించలేదు. భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి అని అన్నారు. 
 
తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్‌లకు ఎంత ప్రాధాన్యం ఉందో, నిర్మాతగా రామానాయుడుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మ‌రి.. రామ‌నాయుడు బ‌యోపిక్ త్వ‌ర‌లో తెరపైకి వ‌స్తుందేమో చూడాలి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

70 గంటలు పని చేయకపోతే దేశంలో పేదరికం ఎలా పోతుంది : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సినిమాలను ఎందుకు వదిలేశారు? ఇప్పుడేం చేస్తున్నారు?

వాహనాలకు ఎల్ఈడీ లైట్లు వాడకూడదా? వీటితో ప్రమాదాలు పెరుగుతాయా..

నెహ్రూ రాసిన లేఖలు తిరిగి అప్పగించాలి : రాహుల్‌కు పీఎంఎంఎల్ లేఖ

అమ్మబాబోయ్.. ఎముకలు కొరికే చలి... హైదరాబాద్‌‍లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Aquarius : కుంభం.. 2025 రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం చేస్తే?

మకర రాశి 2025 ఫలితాలు.. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేస్తే?

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

Today Daily Astro 13-12-2024 శుక్రవారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments