స్వామి వివేకానంద సూక్తులు....

1. ఆత్మ యెుక్క ఈ అనంతశక్తిని భౌతిక ప్రపంచం మీదకి ప్రసరింపజేస్తే అది భౌతిక సంపదలను ఇస్తుంది. ఆలోచనా విధానంపై ప్రసరింపజేస్తే బుద్దిని వికసింపజేస్తుంది. మనస్సు మీద మనస్సునే పని చేయిస్తే మనిషి దేవుణ్ణి చేస్తుంది. 2. లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు.

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (22:09 IST)
1. ఆత్మ యెుక్క ఈ అనంతశక్తిని భౌతిక ప్రపంచం మీదకి ప్రసరింపజేస్తే అది భౌతిక సంపదలను ఇస్తుంది. ఆలోచనా విధానంపై ప్రసరింపజేస్తే బుద్దిని వికసింపజేస్తుంది. మనస్సు మీద మనస్సునే పని చేయిస్తే మనిషి దేవుణ్ణి చేస్తుంది.
 
2. లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు. మెుత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో. నీకు కావలసిన బలం, శక్తి.... అన్నీ నీలోనే ఉన్నాయి.
 
3. ఆదర్శం గల వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే, ఏ ఆదర్శం లేని వ్యక్తి ఏభై వేల తప్పులు చేస్తాడనడం నిస్సంశయం. కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండటం మంచిది.
 
4. విశ్వాసం, సౌశీల్యం గల ఆరుగురు వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. మనకు కావలసినవి మూడు-ప్రేమించే హృదయం, భావించే మనస్సు, పని చేసే చెయ్యి.
 
5. వేయి ఓటములనైనా ఓర్చుకొని, పట్టు వదలకుండా ప్రయత్నించినప్పుడే సద్గుణాలను, శీలసంపత్తిని సమకూర్చుకోగలం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీవీకే చీఫ్ విజయ్ నామినేషన్ దాఖలు.. ఆస్తుల సంగతేంటంటే?

డబ్బు.. డబ్బు.. డబ్బు.. వేధిస్తుందని ప్రియురాలిని చంపి.. ఫ్రిజ్‌లో పెట్టాడు...

విశాఖ ఆర్‌టిఓ వద్ద డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్‌ను ప్రారంభించిన డియాజియో ఇండియా

ఏపీకి అమరావతి రాజధాని ఒక్కటేనా? భవిష్యత్తులో మరోచోటకి వెళ్తామేమో?: మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు

తెలంగాణ ఉద్యమకారులకిచ్చిన హామీలు ఏమయ్యాయి? రేవంత్ సర్కారుకి రాములమ్మ సూటి ప్రశ్న

అన్నీ చూడండి

లేటెస్ట్

27-03-2026 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య నుంచి బయటపడతారు

శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం

శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?

26-03-2026 గురువారం ఫలితాలు - పొగడ్తలకు పొంగిపోవద్దు

25-03-2026 బుధవారం ఫలితాలు-దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments