Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివేకానంద సూక్తులు... ద్వేషానికి వున్న శక్తి కంటే...

1. నిజమైన చిత్తశుద్ధితో ఏ పనిలోనైనా నిమగ్నమైతే, మీరు విజయం సాధించడం తధ్యం. సర్వశక్తులనూ సంపూర్ణంగా ధారబోసి పని చేసేవారు విజయాన్ని సాధించడమే గాక అందులో లీనమైపోయి పరమ సత్యాన్నే సాక్షాత్కరించుకుంటారు. మనస్పూర్తిగా ఓ పనిని చేసే వారందరికి సహాయం భగవంతును న

వివేకానంద సూక్తులు... ద్వేషానికి వున్న శక్తి కంటే...
, బుధవారం, 4 ఏప్రియల్ 2018 (22:36 IST)
1. నిజమైన చిత్తశుద్ధితో ఏ పనిలోనైనా నిమగ్నమైతే, మీరు విజయం సాధించడం తధ్యం. సర్వశక్తులనూ సంపూర్ణంగా ధారబోసి పని చేసేవారు విజయాన్ని సాధించడమే గాక అందులో లీనమైపోయి పరమ సత్యాన్నే సాక్షాత్కరించుకుంటారు. మనస్పూర్తిగా ఓ పనిని చేసే వారందరికి సహాయం భగవంతును నుండి లభిస్తుంది.
 
2. ప్రతి సుఖం తరువాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేదంటే తక్కువ ఉండవచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఃఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి.
 
3. సత్యాన్ని త్రికరణశుద్దిగా నమ్మితే విజయం తధ్యం. నెమ్మదిగానైనా సరే, మనం జయించి తీరుతాం.
 
4. కార్యశక్తి కంటే, కష్టాల్ని భరించే శక్తి గణించలేనంత గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకు ఉన్న శక్తి అనంత రెట్లు ప్రభావశీలమైనది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన గృహంలోనే తథాస్తు దేవతలు వుంటారా?