Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీరామ నవమి ఎప్పుడు?... 25న లేక 26వ తేదీనా?

హిందువుల అతి ముఖ్యపర్వదినాల్లో శ్రీరామ నవమి ఒకటి. అయితే, ఈ యేడాది ఈ పండుగ నిర్వహణపై ఓ ధర్మ సందేహం ఉత్పన్నమైంది. శ్రీరామ నవమిని ఈనెల 25వ తేదీన నిర్వహించాలా? లేక 26వ తేదీన నిర్వహించుకోవాలా? అనేది ఆ ధర్మ

శ్రీరామ నవమి ఎప్పుడు?... 25న లేక 26వ తేదీనా?
, మంగళవారం, 20 మార్చి 2018 (11:42 IST)
హిందువుల అతి ముఖ్యపర్వదినాల్లో శ్రీరామ నవమి ఒకటి. అయితే, ఈ యేడాది ఈ పండుగ నిర్వహణపై ఓ ధర్మ సందేహం ఉత్పన్నమైంది. శ్రీరామ నవమిని ఈనెల 25వ తేదీన నిర్వహించాలా? లేక 26వ తేదీన నిర్వహించుకోవాలా? అనేది ఆ ధర్మసందేహం. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వేర్వేరు తేదీల్లో ఈ పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో ఈ గందరగోళం నెలకొంది. 
 
నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించిన క్యాలెండర్ ప్రకారం శ్రీరామ నవమి ఈనెల 25వ తేదీ అని ఉంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం  26వ తేదీన భద్రాచలంలో ఈ పండుగను జరుపనున్నట్టు ప్రకటించింది. అదే ఆంధ్రప్రదేశ్ సర్కారు మాత్రం తితిదే క్యాలెండర్ తేదీనే అనుసరించనున్నట్టు తెలిదింది.  
 
పైగా ఇలా నిర్వహించడానికి గల కారణాలను కూడా వివరించింది. 'నవమి తిథి ఈనెల 25న సూర్యోదయం తర్వాత వస్తుంది. 26వ తేదీ సూర్యోదయానికి ముందే ముగిసి, సూర్యోదయ సమయానికి దశమి వచ్చేస్తుంది. అలాంటి సందర్భాల్లో ముందు రోజునే నవమి వేడుకలు నిర్వహించాలని ధర్మసింధు చెబుతోందని గుర్తుచేస్తున్నారు. 
 
కానీ, తెలంగాణాలోని వేద పండితులు మాత్రం మరోలా స్పదిస్తున్నారు. అష్టమితో కూడిన నవమి పనికిరాదు. ధర్మసింధు కూడా ఇదే స్పష్టం చేస్తోంది. ఆ ప్రకారమే, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయించిన మేరకు తెలంగాణ ప్రభుత్వం అక్కడ 26వ తేదీన సీతారామకల్యాణం జరిపించనుందని వారు అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం (20-03-18) దినఫలాలు : స్త్రీలతో మితంగా...