మనం పనికిరానివారం ఎలా అవుతాం... స్వామి వివేకానంద
1. ప్రతి జీవిలోను దివ్యత్వం గర్భితంగా ఉంది. బాహ్యాంతర ప్రకృతిని నియంత్రించి, అంతర్గతమైన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడమే జీవిత పరమావధి. దీనికై కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలలో ఒక్కటిగాని, కొన్నింటిని గాని లేదా అన్నింటినీ గాని అవలంభించి ముక్తులవచ్చు.

2. శక్తి అంతా మీలోనే ఉంది... దీనిని విశ్వసించండి. బలహీనులమని భావించకండి. లేచి నిలబడి మీలో అంతర్లీనంగా ఉన్న శక్తిని ప్రకటించండి.
3. మనం సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని బిడ్డలం, ఆ అఖండ దివ్యాగ్నిలో నిప్పురవ్వలం. మనం పనికిరానివారం ఎలా అవుతాం.
4. ఆత్మ ఎన్నడూ జన్మించి ఉండలేదు, ఎన్నడూ మరణించదు. మనం మరణిస్తామన్న భావన, చావుకు భయపడటం వంటివి కేవలం మూఢనమ్మకాలు. మనం దీనిని చేయగలం, దానిని చేయలేం అనే భావాలు కూడా భ్రాంతి జనితాలే. మనం అన్నింటినీ చేయగలం.
5. నీవు ఎవరివి, నీ స్వస్వరూపం ఏమిటో తెలుసుకో. అంతర్నిహితంగా ఉన్న అనంతశక్తిని జాగృత పరచుకో. అప్పుడు బంధాలు తెగిపోతాయి.
6. జ్ఞానమే శక్తి అని లోకోక్తి. జ్ఞానంతోనే మనం శక్తిమంతులమవుతాం. మనిషి తనను తాను అనంతశక్తి సమన్వితుడిగా, బలసంపన్నుడిగా తెలుసుకోవాలి.
7. మనిషి స్వస్వరూపరీత్యా సర్వజ్ఞుడు, సర్వశక్తిశాలి. ఇది అతడు తప్పక గ్రహించాలి. తన ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తూన్న కొద్దీ మనిషి ఈ శక్తిని అధికంగా ప్రకటితం చేయగల్గుతాడు బంధాలనుండి విడివడి ముక్తుడవుతాడు.