భగవంతుడి అనుగ్రహం కలగాలంటే...?

ఆధ్యాత్మికపరంగా భగవంతుని చేరుకోవాలంటే కొన్ని కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. దీనికి సాధన ఎంతో ముఖ్యం. సాధన పరిపుష్టి కానిదే గమ్యాన్ని చేరలేము. ఏ కాస్తయినా కోరిక అనేది ఉన్నట్లయితే భగవంతు

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (20:38 IST)
ఆధ్యాత్మికపరంగా భగవంతుని చేరుకోవాలంటే కొన్ని కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. దీనికి సాధన ఎంతో ముఖ్యం. సాధన పరిపుష్టి కానిదే గమ్యాన్ని చేరలేము. ఏ కాస్తయినా కోరిక అనేది ఉన్నట్లయితే భగవంతుణ్ణి ప్రాప్తించుకోలేము. ధర్మం అతి సూక్ష్మమైనది. సూదిలోకి దారం ఎక్కించేటప్పుడు దారంలో ఒక్క నూలుప్రోగు విడివడి ఉన్నా సరే, దానిని సూదిలోకి ఎక్కించలేము.
 
కొందరు ముప్పై ఏళ్లపాటు జపం చేసి ఉంటారు. అయినప్పటికి ఏమి ప్రయోజనం... కుళ్లిపోతున్న పుండు మామూలు మందులతో మానదు. దానికి పిడకలు కాల్చి వాతలు పెట్టవలసి ఉంటుంది. కోరికలు ఉన్నట్లయితే, సాధనలు ఎన్ని చేసినప్పటికి యోగం సిద్ధిచదు. కాని ఒక్క విషయం మాత్రం నిజం. భగవత్ కృప కలిగినట్లయితే ఆయన కనుక అనుగ్రహించినట్లయితే ఒక్కక్షణం లోనే యోగం సిద్దిస్తుంది. వెయ్యేళ్లుగా చీకటితో నిండిన గదిలోకి ఎవరైనా దీపాన్ని తీసుకువస్తే ఆ గది ఒక్కక్షణంలో ప్రకాశవంతమవుతుంది.
 
పేద బాలుడొకడు ఒక పెద్ద ఆసామి దృష్టిలో పడ్డాడు. ఆయన ఆ పేదవాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. వెంటనే ఆ పేదవాడికి ఇల్లూవాకిలీ, పొలంపుట్రా, బండ్లు వాహనాలు, సేద్యగాండ్రూ అన్నీ చేకూరాయి. భగవంతుడిది బాలక స్వభావం. పిల్లవాడొకడు జేబులో రత్నాలు పెట్టుకొని ఇంటి గడప మీద కూర్చొని ఉన్నాడనుకుందాం. దారిలో ఎంతోమంది వస్తూపోతూ ఉంటారు. వారిలో చాలామంది ఆ బాలుణ్ణి రత్నాలు ఇవ్వమని అడుగుతారు. 
 
కాని ఆ పిల్లవాడు ముఖం ప్రక్కకు త్రిప్పుకొని ఊహూ నేను ఇవ్వనంటే ఇవ్వను అంటాడు. అయితే కాసేపటి తర్వాత ఎవరో వ్యక్తి ఆ దారిన వెళుతున్నాడనుకుందాం. అతడు రత్నాలు కావాలని కూడా అడుగడు. అయినాసరే, ఈ బాలుడు అతడి వెంట పరుగు పరుగున వెళ్లి రత్నాలన్నింటినీ బలవంతంగా ఆ వ్యక్తి చేతిలో పెడతాడు. అలాగే సాధన పూర్తి అయినవారికి భగవత్ కృప దానంతట అదే లభిస్తుంది అనడంలో సందేహం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్ళయి నెలకే గుట్టపై నుంచి పడి నవ వధువు మృతి

రౌడీయిజం - దౌర్జన్యం చేయడానికే వైకాపా నేతల అమరావతి యాత్ర : హోం మంత్రి అనిత

వల్లభనేని వంశీ ఇలా అయిపోయారేంటి? వీడియో వైరల్

ఇంట్లో చెప్పడం వల్లే ఫలితం శూన్యం.. అందుకే చంపేద్దాం : కేతన్ భార్య సియా

కేతన్‌తో పెళ్లి ఇష్టం లేదని చెప్పి వుంటే వివాహం రద్దు చేసేవాళ్లం.. గోయల్ సోదరుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

తర్వాతి కథనం
Show comments